AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Faima: ఆయన వల్లే నేను బాగా ఫేమస్ అయ్యా.. బయటి ఈవెంట్స్‌కు కూడా నన్ను తీసుకెళ్లాడు.. జబర్దస్త్ ఫైమా

ప్రస్తుతం బుల్లితెరపై బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్న వారిలో లేడీ కమెడియన్ ఫైమా ఒకరు. జబర్దస్త్ తో పాటు పలు టీవీ ప్రోగ్రామ్స్, షోస్ లోనూ చేస్తోందీ ట్యాలెంటెడ్ యాక్ట్రెస్. బుల్లితెరపై ఈ బ్యూటీ వేసే కామెడీ పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Jabardasth Faima: ఆయన వల్లే నేను బాగా ఫేమస్ అయ్యా.. బయటి ఈవెంట్స్‌కు కూడా నన్ను తీసుకెళ్లాడు.. జబర్దస్త్ ఫైమా
Jabardasth Faima
Basha Shek
|

Updated on: Apr 08, 2026 | 7:08 PM

Share

ఈటీవీలో ప్రసారమైన ‘పటాస్‌’ షోతో మొదటి సారి వెలుగులోకి వచ్చింది ఫైమా. తన కామెడీ పంచులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తన ట్యాలెంట్ తో జబర్దస్త్ లోనూ అడుగు పెట్టింది. తన కామెడీ స్కిట్స్ తో బుల్లితెర ఆడియెన్స్ ను బాగా నవ్వించింది. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ తో కలిసి ఫైమా చేసిన స్కిట్ల కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లోనూ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది ఫైమా. విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఫైమా ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు పలు కామెడీ ప్రోగ్రామ్స్, టీవీ షోస్ తోనూ బిజీ బిజీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ టాక్ షోకు హాజరైందీ లేడీ కమెడియన్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. అదే సమయంలో కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన ఇబ్బందులను అందరితో పంచుకుంది.

‘హైదరాబాద్‌ వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎవరూ లేరు. హాస్టల్‌లో ఉన్నప్పుడు కొత్త కొత్త వాళ్లు పరిచయం అయ్యారు. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. పటాస్‌కి వెళ్లినప్పుడు కూడా తొలి రెండేళ్లు నాకు పెద్దగా ఛాన్స్‌లు రాలేదు. పేమెంట్స్ కూడా పెద్దగా లేవు. అయితే బుల్లెట్ భాస్కర్ అన్న స్కిట్స్ లో చేయడం మొదలైనప్పటి నుంచి నా జీవితం మలుపు తిరిగింది. అవకాశాలు పెరిగాయి. పేమెంట్స్ కూడా పెరిగాయి. నిజం చెప్పాలంటే బుల్లెట్ భాస్కర్ అన్న వల్లే నేను త్వరగా ఫేమస్ అయ్యాను. ఆయన నన్ను బయట ఈవెంట్స్‌కి కూడా తీసుకెళ్లడంతో నాకు రెండూ ప్లస్ అయ్యాయి’ అని ఫైమా ఎమోషనల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఫైమా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

View this post on Instagram

A post shared by FAIMA (@faima_patas)

ఇక సినిమా అవకాశాలపై స్పందించిన ఫైమా.. ‘ నాకూ సినిమా ఆఫర్లు చాలా వచ్చాయి.. కానీ సినిమా అంటే ఎలా చేయాలో అర్ధం కాలేదు. ఒక సినిమాలో ఆఫర్ వస్తే వెళ్లాను. లేడీ కమెడియన్‌గా మంచి క్యారెక్టర్ అని చెప్పడంతో ఏదేదో ఊహించుకున్నాను. తీరా అక్కడికి వెళితే నాకు డైలాగ్స్ లేవు. మొత్తం 10 రోజులు షూట్ అని చెప్పారు. కానీ నన్ను సరిగా యూజ్ చేసుకోలేదు. సినిమాలపై నాకు ఇంట్రెస్ట్ లేదు. దీనికి తోడు మధ్యలో నాకు జబర్దస్త్ షూట్స్ ఉంటాయి. కావాలంటే ఏదైనా వదులకుంటా కానీ, జబర్దస్త్‌ను మాత్రం వదులుకోను ‘ అని అంటోంది ఫైమా. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by FAIMA (@faima_patas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us