Kiraak RP: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నజబర్దస్త్ కమెడియన్.. ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేసిన కిర్రాక్ ఆర్పీ
చేపల పులుసు బిజినెస్‌తో బిజిబిజీగా ఉన్న కిర్రాక్ ఆర్పీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన, హడావిడి లేకుండా ఎంతో గోప్యంగా. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న లక్ష్మీ ప్రసన్న మెడలో మూడు ముళ్లు వేశాడు ఆర్పీ. బుధవారం (నవంబర్ 29న) విశాఖపట్నం వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది.

కిర్రాక్ ఆర్పీ అలియాస్ రాటకొండ ప్రసాద్.. జబర్దస్త్ కామెడీ షో తో వెలుగులోకి వచ్చిన ఈ కమెడియన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తనదైన ప్రాసలు, పంచులతో తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న ఈ నటుడు ఆ మధ్యన చేపల పులుసు బిజినెస్ తో నిత్యం వార్తల్లో నిలిచాడు. మొదట కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు అంటూ కర్రీ పాయింట్‌ను ఓపెన్ చేసిన కిర్రాక్ ఆర్పీ ఆ తర్వాత మణికొండ, అమీర్ పేట తదితర ప్రాంతాల్లో బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. ఇటీవలే నెల్లూరులోనూ చేపల పులుసు పెంటర్ ప్రారంభించాడు. ప్రముఖ నటి, మంత్రి రోజా చేతుల మీదుగా ఈ కర్రీ పాయింట్ ఓపెనింగ్ అట్టహాసంగా జరిగింది. ఇలా చేపల పులుసు బిజినెస్‌తో బిజిబిజీగా ఉన్న కిర్రాక్ ఆర్పీ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన, హడావిడి లేకుండా ఎంతో గోప్యంగా. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న లక్ష్మీ ప్రసన్న మెడలో మూడు ముళ్లు వేశాడు ఆర్పీ. బుధవారం (నవంబర్ 29న) విశాఖపట్నం వేదికగా వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. కేవలం ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సన్నిహితులు మాత్రమే ఆర్పీ పెళ్లికి హాజరయ్యారు. ప్రస్తుతం వీరి జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. జబర్దస్త్ కమెడియన్లు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కిర్రాక్ ఆర్పీ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
లక్ష్మీ ప్రసన్నది విశాఖపట్నం. గతేడాది మా ఎంగేజ్‌మెంట్ జరిగింది. మేము ప్రేమించుకున్నాం. పెద్దలను ఒప్పించే ఈ పెళ్లి చేసుకుంటున్నాం. నిశ్చితార్థం, ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలకు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ఇతర వీఐపీలు హాజరయ్యారు. అందుకే ఈసారి కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇందుకు వైజాగ్‌ను వేదికగా ఎంచుకున్నాం. పెళ్లి విషయాన్ని కూడా గోప్యంగా ఉంచాం’ అని ఆర్పీ చెప్పుకొచ్చాడు. కాగా గతడాది మేలో ఆర్పీ- లక్ష్మీల నిశ్చితార్థం జరిగింది. అప్పుడు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.
శ్రీవారి సేవలో ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న..
View this post on Instagram
ఆర్పీ, లక్ష్మీ ప్రసన్నల ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








