AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: ఆ అనుమానమే నిజం కానుందా..? సలార్ సినిమా ఆ సినిమాకు రీమేక్‌గా రానుందా..?

డిసెంబర్‌లో ‘సలార్‌’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ‘సాలార్’ సినిమా కథాంశాన్ని బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారే కథే 'సలార్' సినిమా అని తెలిపాడు. ప్రభాస్, మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ మధ్య జరిగే కథే సినిమాకు మెయిన్ పాయింట్ అని తెలిసింది.

Salaar: ఆ అనుమానమే  నిజం కానుందా..? సలార్ సినిమా ఆ సినిమాకు రీమేక్‌గా రానుందా..?
Salaar
Rajeev Rayala
|

Updated on: Nov 29, 2023 | 6:04 PM

Share

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్’ ఈ ఏడాది ఇండియాలో భారీ అంచనాలున్న సినిమాగా నిలిచింది సలార్. ‘కేజీఎఫ్’ సిరీస్ ద్వారా భారీ బ్లాక్ బస్టర్లు అందించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా చేయడంతో  అంచనాలు వంద రెట్లు పెరిగాయి. డిసెంబర్‌లో ‘సలార్‌’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ‘సాలార్’ సినిమా కథాంశాన్ని బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారే కథే ‘సలార్’ సినిమా అని తెలిపాడు. ప్రభాస్, మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ మధ్య జరిగే కథే సినిమాకు మెయిన్ పాయింట్ అని తెలిసింది. అయితే మిత్రులు ఇలా శత్రువులుగా మారడానికి కారణం ఏమిటి? స్నేహితుల యుద్ధంలో చివరికి ఎవరు గెలుస్తారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

‘సలార్’ సినిమా మొదలైనప్పటి నుంచి కన్నడ సినిమా ‘ఉగ్రమ్’కి ఇది రీమేక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉగ్రం’. అందులోనూ హీరో శ్రీమురళి, తిలక్ స్నేహితులు. అయితే ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారతారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ చెప్పినట్లుగా ‘సలార్’ సినిమాలో స్నేహితులు శత్రువులుగా మారే కథాంశం ఉంది. ప్రశాంత్ నీల్ ‘సలార్’  లైన్ చెప్పిన తర్వాత ఈ సినిమా ‘ఉగ్రం’కి రీమేక్ అవుతుందా అనే అనుమానం మరింత బలపడింది.

కానీ ‘ఉగ్రం’ సినిమా ఒక పార్ట్ పూర్తి చేయగా.. ‘సలార్’ సినిమా రెండు భాగాలుగా విడుదలవుతోంది. ‘సలార్’ చిత్రం ‘ఉగ్రం’కి రీమేక్ కాదా అనే దానిపై చిత్ర బృందం నుండి అధికారిక సమాచారం లేదు. కానీ ‘సలార్’ సినిమా షూటింగ్ దశలో ఉండగానే యూట్యూబ్‌తో పాటు పలు ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ‘ఉగ్రం’ సినిమాను తొలగించారు. దీంతో ‘సలార్‌’, ‘ఉగ్రం’ రీమేక్‌ గా ఉంటుందనే అనుమానం కూడా బలపడింది. సలార్ మూవీలో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమార్, జగపతి బాబు, కన్నడిగ మధు గురు స్వామి, రామకృష్ణ, పంజు, బాలీవుడ్ నటుడు టిను ఆనంద్ తదితరులు నటిస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటించింది. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూరు సంగీతం అందించారు. డిసెంబర్ 22న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.