Sandeep Reddy Vanga: ప్రభాస్ స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ఆ హీరోతో సినిమా చేయనున్నాడా.
ఇప్పుడు 'యానిమల్ ' సినిమా విడుదలకు రెడీ అయ్యింది. కానీ 'అర్జున్‌రెడ్డి' హిట్ అయిన తర్వాత సందీప్ తో పనిచేయడానికి పెద్ద స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కోసం సందీప్ అదే సినిమాను రీమేక్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమా చేశాడు.

ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. సందీప్ దర్శకత్వం వహించిన ‘ అర్జున్ రెడ్డి ‘ అలాగే దాని రీమేక్ గా వచ్చిన ‘కబీర్ సింగ్’ మినహా ఇప్పటి వరకు మరే సినిమా విడుదల కాలేదు. ఇప్పుడు ‘యానిమల్ ‘ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. కానీ ‘అర్జున్‌రెడ్డి’ హిట్ అయిన తర్వాత సందీప్ తో పనిచేయడానికి పెద్ద స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కోసం సందీప్ అదే సినిమాను రీమేక్ చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమా చేశాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. ప్రభాస్ కోసం సందీప్ దర్శకత్వం వహిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది.
ప్రభాస్ తో సినిమా తర్వాత సందీప్ మరో స్టార్ తో సినిమా చేయనున్నాడు. అతనే మహేష్ బాబు. సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే మహేష్ బాబుకి కథ చెప్పాడట. ఆ సినిమా పేరు ‘డెవిల్’. ‘యానిమల్ లానే ‘డెవిల్’ సినిమా కూడా బలమైన హింసాత్మక కథాంశంతో రూపొందనుంది. ‘యానిమల్’ కంటే ‘డెవిల్’ హింసాత్మకంగా ఉంటుందని సందీప్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
సందీప్ ముందుగా ‘యానిమల్’ సినిమా కథను మహేష్ బాబుకి చెప్పాడని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ సందీప్ దీన్ని కొట్టిపారేస్తూ.. తాను మహేష్ బాబుకి ‘డెవిల్’ కథను ‘యానిమల్’ తరహాలో చెప్పానని, అయితే అది ‘యానిమల్’ కంటే హింసాత్మకంగా ఉంటుందని చెప్పాడు. కానీ ఆ సినిమా తెరకెక్కలేదని చెప్పాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా తర్వాత మహేష్ బాబుతో సందీప్ రెడ్డి సినిమా చేస్తాడేమో చూడాలి. అభిమానులు కూడా మహేష్ బాబుతో సందీప్ రెడ్డి సినిమా చేయాలనీ కోరుకుంటున్నారు. కాగా, డిసెంబర్ 1న ‘యానిమల్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో అనిల్ కపూర్ కూడా నటిస్తున్నాడు.
Guys….. check this out https://t.co/oTHBRw8oMt
— Sandeep Reddy Vanga (@imvangasandeep) November 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
