Sowmya Rao: క్యాన్సర్‌తో అమ్మ నన్నుకూడా మర్చిపోయింది.. ఆమె నా కడుపునే పుట్టాలి.. ‘తల్లి’డిల్లిపోయిన యాంకర్ సౌమ్య
స్క్రీన్‌పై ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా కనిపించే సౌమ్యారావు పర్సనల్ లైఫ్‌లో చాలామందికి తెలియని కన్నీటి కష్టాలున్నాయి. ఆమె తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసింది. ముఖ్యంగా జీవిత చరమాంకంలో ఆమె ఎంతో నరకం చూసింది. కనీసం కూతురిని కూడా గుర్తుపట్టలేని స్థితికి వెళ్లిందట.
జబర్దస్త్ యాంకర్‌గా తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొంది సౌమ్యారావు. కర్ణాటకకు చెందిన ఈ అందాల తార వచ్చీరాని తెలుగు భాషలో అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. షోలో చలాకీగా ఉంటూ టీమ్ లీడర్లు, కంటెస్టెంట్ల మీద అదిరిపోయే పంచులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే స్క్రీన్‌పై ఎప్పుడూ నవ్వుతూ, సరదాగా కనిపించే సౌమ్యారావు పర్సనల్ లైఫ్‌లో చాలామందికి తెలియని కన్నీటి కష్టాలున్నాయి. ఆమె తల్లి క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసింది. ముఖ్యంగా జీవిత చరమాంకంలో ఆమె ఎంతో నరకం చూసింది. కనీసం కూతురిని కూడా గుర్తుపట్టలేని స్థితికి వెళ్లిందట. ఈ విషాదాన్ని గతంలోనే అందరితో పంచుకుంటూ ఎమోషనలైంది సౌమ్య. తాజాగా మరోసారి తన తల్లిని గుర్తుకు తెచ్చుకుంది జబర్దస్త్ యాంకరమ్మ. స్టేజిపైనే బోరున ఏడ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ఒకరోజు అమ్మకు బాగా తలనొప్పి వచ్చింది. హాస్పిటల్‌కు తీసుకెళ్తే బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. క్యాన్సర్ కారణంగా అమ్మ నెమ్మదిగా జ్ఞాపక శక్తి కోల్పోయింది. ఆఖరుకు నన్ను కూడా మర్చిపోయింది. కనీసం గుర్తుపట్టలేకపోయింది. సుమారు మూడున్నరేళ్లపాటు బెడ్‌పైనే కంటికి రెప్పలా చూసుకోవాల్సి వచ్చింది. ఆ భగవంతుడు అమ్మను ఇంతటి దారుణ స్థితికి తెస్తాడని అసలు ఊహించలేదు. అమ్మ మళ్లీ నా కడుపులోనే పుట్టాలనుకుంటున్నా’ అని ఎమోషనలైంది సౌమ్య. దీంతో తోటి కంటెస్టెంట్లు ఆమెను ఓదార్చారు.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.