AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakesh Master: రాకేష్ మాస్టర్ భార్య పై దాడి చేసిన మహిళలు.. కారణం ఏంటంటే

రాకేష్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మీ అనే ఆమె పై పలువురు  మహిళలు దాడి చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ విషయం అయి గొడవ జరిగిందని తెలుస్తోంది.

Rakesh Master: రాకేష్ మాస్టర్ భార్య పై దాడి చేసిన మహిళలు.. కారణం ఏంటంటే
Rakesh Master Wife
Rajeev Rayala
|

Updated on: Jul 08, 2023 | 2:41 PM

Share

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అకస్మాత్తుగా కన్నుమూసిన విషయం తెలిసిందే. విపరీతంగా మద్యం సేవించడంతో ఆయన అనారోగ్యానికి గురై మరణించారు. గతంలో కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పని చేశారు రాకేష్ మాస్టర్. ప్రభాస్, రవితేజ, మహేష్ బాబు, రామ్ పోతినేని లాంటి స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు రాకేష్ మాస్టర్ అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్స్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, సత్యా మాస్టర్, జానీ మాస్టర్ కు గురువు రాకేష్ మాస్టర్. కానీ కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటూ.. పలు యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు చేస్తున్నారు. ఆయన మరణంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా రాకేష్ మాస్టర్ మూడో భార్య పై కొందరు మహిళలు దాడి చేశారు.

రాకేష్ మాస్టర్ మూడో భార్యగా చెప్పుకుంటున్న లక్ష్మీ అనే ఆమె పై పలువురు  మహిళలు దాడి చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ విషయం అయి గొడవ జరిగిందని తెలుస్తోంది. లక్ష్మీ పై లల్లి అనే యూట్యూబర్, నెల్లూరుకు చెందిన భారతితోపాటు మరో ముగ్గురు కలిసి హైదరాబాద్ పంజాగుట్ట లో దాడి చేశారు.

రాకేష్ మాస్టర్ కు చెందిన ఓ యూట్యూబ్ ఛానెల్ ను లక్ష్మీ లాకుందని.. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత రాకేష్ మాస్టర్ కుటుంబ సభ్యులు ఆ ఛానెల్ ను తిరిగి తీసుకునే క్రమంలో గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తన పై జరిగిన దాడి గురించి లక్ష్మీ స్పందిస్తూ.. నెల్లూరుకు చెందిన భారతి అనే మహిళ ఇదంతా చేయిస్తుందని. తనను చంపేందుకు లక్షరూపాయిలు సుపారీ కూడా ఇచ్చిందని.. పలు మార్లు చంపేస్తా అని బెదిరిచిందని తెలిపింది.

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి