Chiranjeevi: థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. హీరోయిన్, సాంగ్స్ లేకుండా చిరంజీవి సినిమా..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇందులో ఆషిక రంగనాథ్, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నారు. రీసెంట్ డేస్ లో చిరంజీవి నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన భోళాశంకర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నిరాశపరచడంతో అభిమానులంతా ఇప్పుడు విశ్వంభర సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన బింబిసార సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమా ఆయన కెరీర్ లోనే బిగెస్ట్స్ లో ఒకటిగా నిలిచింది. ఆతర్వాత ఇప్పుడు వశిష్ఠ మెగాస్టార్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉంటుందా.? అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే మెగాస్టార్ ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో రెండు సినిమాలను కూడా లైనప్ చేశారని తెలుస్తుంది. వాటిలో ఒకటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ కొట్టిన అనిల్.. ఇప్పుడు మెగాస్టార్ తో అదిరిపోయే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. శ్రీకాంత్ సుకుమార్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరి నాన్నకు ప్రేమతో , రంగస్థలం సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ తరువాత 2023లో ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా అరంగ్రేటం చేసి తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నాడు.
శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు నానితో కలిసి మరోసారి ప్యారడైజ్ సినిమా చేస్తున్నాడు. అలాగే చిరంజీవితో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రానున్న సినిమాలో డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కనుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో చిరు ఊర మాస్ లుక్ లో కనిపిస్తారని టాక్. అంతే కాదు.. ఈ సినిమాలో హీరోయిన్ , సాంగ్స్ ఉండవని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాలంటే మరికొద్దిరోజుల్లో ఎదురుచూడాల్సిందే..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








