AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sneha: ఆ స్టార్ హీరో అంటే నాకు పిచ్చి.. మనసులో మాట చెప్పిన అందాల తార స్నేహ..

నటి స్నేహ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సావిత్రి, సౌందర్య తర్వాత ఆ స్థాయిలో హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుందీ అందాల తార. గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈ అందాల తార ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజి బిజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Sneha: ఆ స్టార్ హీరో అంటే నాకు పిచ్చి.. మనసులో మాట చెప్పిన అందాల తార స్నేహ..
Sneha
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2025 | 9:50 AM

Share

స్నేహ.. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. స్నేహను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది వాటిలో సంక్రాంతి, రాధాగోపాళం, శ్రీరామదాసు వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి. స్నేహ తెలుగులో తొలివలపు అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించాడు. ఆతర్వాత ప్రియమైన నీకు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ భామ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది. చూడచక్కని రూపంతో పాటు అద్భుతమైన నటనతోనూ ఆకట్టుంది స్నేహ.

తెలుగులో వరుసగా హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు,మహారధి,మధుమాసం,సంక్రాంతి,వెంకీ,ఏవండోయ్ శ్రీవారు,పాండురంగడు లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆతర్వాత స్నేహ ఈ మధ్యకాలంలో సహాయక పాత్రల్లో నటిస్తుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన s/o సత్యమూర్తి, రామ్ చరణ్ హీరోగా చేసిన వినయ విధయ రామ సినిమాల్లో సహయక పాత్రల్లో మెరిసింది స్నేహ. కాగా రీసెంట్ గా దళపతి విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలో ఆయన భార్యగా చేసి ఆకట్టుకుంది.

స్నేహ తమిళ్ లోనూ చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. విజయ్, అజిత్, కమల్, సూర్య, ప్రశాంత్, ధనుష్ లతో నటించింది. ముఖ్యంగా దళపతి విజయ్, అజిత్ లతో ఆమె సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరో ఎవరు అనేదానికి సమాధానం చెప్పారు. స్నేహ మాట్లాడుతూ.. తనకు అజిత్ అంటే ఇష్టమని అన్నారు. ఇక స్నేహ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. నటనకు ప్రదాన్యత పాత్రలను ఎంచుకుంటున్నారు స్నేహ. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద