తంతే బూరెల బుట్టలో పడటం అంటే ఇదే.. బుల్లిరాజుకు బంపర్ ఆఫర్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా గత నెల జనవరి 14న విడుదలై భారీగా వసూళ్లు రాబట్టింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.

ఎఫ్ 2, ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఆడియెన్స్ ను అలరించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్. దడపా రూ. 300కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. కాగా ఈ సినిమా చూసిన వారందరూ ఒక పిల్లాడి గురించి తెగ మాట్లాడుకున్నారు. అదే బుల్లిరాజు పాత్ర పోషించిన భీమల రేవంత్ పవన్ సాయి సుభాష్.ఈ బుడ్డోడు తన నటనతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు.
మూవీలో వెంకటేశ్ కుమారుడి పాత్రలో రేవంత్ అదరగొట్టాడు. స్క్రీన్ పై ఈ బుడ్డోడు కనిపించినప్పుడల్లా థియేటర్లలోని ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. ముఖ్యంగా గోదారి యాసలో ఈ పిల్లాడు చెప్పే డైలాగులకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఈ చిన్నోడికి కూడా అంతే పేరు వచ్చింది. ఇక ఈ చిన్నడి నటనకు సెలబ్రెటీలు కూడా ఫిదా అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిన్నోడిని ప్రత్యేకంగా అభినందించారు కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ బుడతడి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో రేవంత్ ఆఫర్ అందుకున్నడని తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. విశ్వంభర అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా రానుంది. ఈ సినిమాలో అనిల్ మరోసారి రేవంత్ కు ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. వెంకటేష్ తో ఆకట్టుకున్న ఈ బుడతడు. ఇప్పుడు మెగాస్టార్ తో కలిసి నవ్వులు పూయించనున్నాడని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.