ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! నానికి విలన్‌గా స్టార్ నటుడు.. థియేటర్స్ బ్లాస్ట్ అవ్వడం పక్కా..
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉన్నాడు నాని. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు నాని. వాల్ పోస్టర్ బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు నాని. ఇటీవలే కోర్ట్ సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

నేచురల్ స్టార్ నాని హీరోగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఇటీవలే కోర్ట్ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకున్నాడు నాని. చిన్న సినిమాగా వచ్చిన కోర్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హీరోగా నాని రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వాటిలో హిట్ 3 సినిమా ఒకటి, ప్యారడైజ్ మరొకటి. ఈ రెండు సినిమాల్లో నాన్ని విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. హిట్ 2 భారీ విజయాన్నిసాధించిన విషయం తెలిసిందే. కాగా ది ప్యారడైజ్ ఒక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ చిత్రానికి శ్రీకాంత్ ఓథెల దర్శకత్వం వహించారు. అతను చివరిసారిగా నానితో కలిసి బ్లాక్ బస్టర్ చిత్రం దసరాలో పనిచేశాడు. ది ప్యారడైజ్ చిత్రం టైటిల్ టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది.
ఇది కూడా చదవండి : అక్క స్టార్ హీరోయిన్.. చెల్లి మాత్రం సినిమాలకు దూరంగా ఇలా.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?
నాని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు, భయంకరమైన రూపం, శరీరాకృతి అలాగే రెండు జడలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఆర్ నారాయణమూర్తి నటిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇటీవలే దర్శకుడు శ్రీకాంత్ నారాయణమూర్తిని కలిశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో నటించే విలన్ గురించిన ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి : 1000కోట్ల హీరోయిన్.. ఆస్తి పాస్తులకు లెక్కే లేదు.. కానీ చిన్నకారులో తిరుగుతున్నముద్దుగుమ్మ
ప్యారడైజ్ సినిమాలో ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. నాని సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి, అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, మోహన్ బాబు తన కుమారుడు విష్ణు నిర్మిస్తున్న కన్నప్ప చిత్రంలో కూడా నటిస్తున్నారు. మోహన్ బాబు తన కెరీర్‌ను నెగటివ్ పాత్రలతో ప్రారంభించాడని చాలా మందికి తెలియదు. చాలా సంవత్సరాల తర్వాత అతను విలన్ ఫీల్డ్‌లోకి తిరిగి రావడం అభిమానులలో ఆసక్తి రేపుతుంది.
ఇది కూడా చదవండి :మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







