Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాలో మహేష్ పాత్ర ఇలా ఉండనుందట.. ఫ్యాన్స్ కు పూనకాలే
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమా మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మహేష్ స్టైల్, బాడీలాంగ్వేజ్ అభిమానులను ఉర్రుతలూగించింది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ కాంబోలో మహేష్ సినిమా చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో మహేష్ సరసన మహర్షి సినిమాలో చేసింది ఈ చిన్నది. ఇప్పుడు మరోసారి సూపర్ స్టార్ తో కలిసి రొమాన్స్ చేయనుంది. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ను మొదలు పెట్టనున్నారు. ఆగస్టు మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ఉంటుందని ఇటీవలే అనౌన్స్ చేశారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే తోపాటు ప్రియాంక అరుళ్ మోహన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. దాంతో మహేష్ ద్విపాత్రాభినయం చేయనున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. మహేష్ డ్యూయల్ రోల్ ను గురూజీ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని .. రామ్ లక్షణ్ మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.








