Rajisha Vijayan: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న జై భీమ్ నటి.. ఎవరిని పెళ్లాడబోతుందో తెలుసా.?
2021లో సూర్య నటించిన జై భీమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను జ్యోతిక, సూర్య నిర్మించారు. ఈ సినిమాకు కె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సూర్య, రజిషా విజయన్, ప్రకాశ్‌రాజ్, రావు రమేష్, మణికందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది.

స్టార్ హీరో సూర్య ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తమిళ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు సూర్య. 2021లో సూర్య నటించిన జై భీమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను జ్యోతిక, సూర్య నిర్మించారు. ఈ సినిమాకు కె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సూర్య, రజిషా విజయన్, ప్రకాశ్‌రాజ్, రావు రమేష్, మణికందన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. జై భీమ్ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేశారు. గత ఏడాది నవంబర్ 2న ఓటీటీలోకి వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో జై భీమ్ సినిమా అందుబాటులో ఉంది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు రజిషా విజయన్. 2016లో మలయాళ సినిమా ‘అనురాగ కరిక్కిన్ వెల్లం’ అనే సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. ఆమె నటనకుగాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకుంది ఈ చిన్నది. ఈ అమ్మడు తెలుగులోనూ నటించింది మాస్ రాజా రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించింది.
ఇదిలా యూత్ ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లి పీటలెక్కనుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాల్లోకి రాకముందు పలు టీవీ షోల్లో కనిపించింది ఈ చిన్నది. రజిషా విజయన్, టోబిన్ థామస్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఈ ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి వీరి పెళ్లి పై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.
రజిషా విజయన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
రజిషా విజయన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.