Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార’లోని ఈ చిన్నారి గురించి తెలిస్తే షాక్ అవుతారు.!
కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది బింబిసార(Bimbisara ). సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది బింబిసార.
కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది బింబిసార(Bimbisara ). సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది బింబిసార. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెప్పినట్టే.. నందమూరి ఫ్యాన్స్ కోరినట్టే.. కళ్యాణ్ రామ్‌ను.. కాలర్ ఎగరేసేలా చేస్తోంది. ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించి..రిమైనింగ్ మేకర్స్ తో చప్పట్లు కొట్టించుకుంటోంది. వారిలో కొత్త ఆశలు పుట్టుకొచ్చేలా చేస్తోంది. భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను బద్దుల కొట్టేస్తోంది. చాలా రోజుల తరువాత కలెక్షన్ల సునామీని మరో సారి అందరికీ చూపించేస్తోంది. ఈ ఏడాది నందమూరి హీరోలు ముగ్గురు తమ సత్తా చాటారు. అఖండ సినిమాతో బాలయ్య సంచలన విజయం అడ్డుకుంటే.. అటు తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు.
అయితే ఈ మూడు సినిమాల్లో ఓ కామన్ పాయింట్ ఉంది. మూడు సినిమాల్లో హీరో చిన్న పిల్ల కోసమే పోరాడుతారు. అయితే కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాలోని చిన్నారి ఎవరో తెలుసా..? ఈ చిన్నారి పేరు శ్రీదేవి. పలు సినిమాల్లో ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఇక నాలుగైదు సీరియల్స్ లో కూడా నటించింది శ్రీదేవి. శ్రీదేవి తండ్రి కూడా సినిమా ఫీల్డ్ లోనే ఉన్నారు. ఆయన కూడా ఒక ఆర్టిస్ట్ కావడంతో శ్రీదేవి సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. ‘బింబిసార’ చిత్రానికి గాను శ్రీదేవి కి మంచి గుర్తింపు లభించింది. క్యూట్ లుక్స్ తో, ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటోంది ఈ చిన్నారి. ఇక ఇప్పుడు సెలబ్రెటీస్ తో ఈ చిన్నారి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.