Janhvi Kapoor: ఎన్టీఆర్‌ను ఆ పేరుతో పిలిచిన జాన్వీ.. తారక్ సినిమాపై క్రేజీ కామెంట్స్..
తాజాగా సౌత్ సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్నట్లు వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది.
గుడ్ లక్ జెర్రీ సినిమాతో మరోసారి సూపర్ హిట్ అందుకుంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఇందులో ఆమె నటనకు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. తమిళ్ సూపర్ హిట్ కోలమావు కోకిల చిత్రానికి హిందీ రీమేక్ ఈ మూవీ. ఇందులో నయనతార పోషించిన పాత్రలో జాన్వీ నటించి మెప్పంచింది. ప్రస్తుతం గుడ్ లక్ జెర్రీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న జాన్వీ.. తాజాగా సౌత్ సినిమాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్నట్లు వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది.
ఇటీవల ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన జాన్వీ జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించింది. జాన్వీ మాట్లాడుతూ.. “నేను టాలీవుడ్ సినిమాలు లేదా సౌత్‍లో మూవీ చేయాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎన్టీఆర్ సర్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే నాకు చాలా సంతోషం. ఆయన ఓ లెజెండ్. కానీ దురదృష్టవశాత్తూ నాకు ఆయన సినిమాలో నటించే ఆఫర్ ఇంకా రాలేదు. నేను ఆ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. అలాగే తనకు మణిరత్నం తెరకెక్కించే అలాంటి క్లాసిక్ చిత్రాల్లో నటించాలని చెప్పింది. ఐశ్వర్యరాయ్ ధరించిన సాధారణ తెల్లటి కాటన్ స్కర్ట్ తో పర్వతాలు, జలపాతాల మధ్య తిరుగుతూ బ్యాగ్రౌండ్ లో రెహమాన్ సాంగ్ వచ్చే చిత్రాల్లో నటించాలనుందని తెలిపింది.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.