Kalki 2898 AD Movie: ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. కల్కిలో ప్రభాస్ రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..

ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణే, కమల్ హాసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ పెంచాయి. అలాగే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతుంది.

Kalki 2898 AD Movie: ఫ్యాన్స్‏కు కిక్కిచ్చే న్యూస్.. కల్కిలో ప్రభాస్ రోల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Kalki
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 28, 2024 | 3:33 PM

విడుదలకు ముందే ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేసుకున్న సినిమా కల్కి 2898 ఏడీ. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీ కోసం దేశమంతా వెయిట్ చేస్తుంది. అలాగే ఇటీవల పలు ఇంటర్వ్యూలలో నాగ్ చేసిన కామెంట్స్ ఈ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణే, కమల్ హాసన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై హైప్ పెంచాయి. అలాగే ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ నడుస్తుంది. ఇందుకు కారణాలను కూడా షేర్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ అయిన ప్రభాస్ లుక్స్, నిన్న రిలీజ్ అయిన ప్రభాస్ కొత్త పోస్టర్ మధ్య భేదాలు చూస్తున్నారు ఫ్యాన్స్. దీంతో ఈ మూవీలో ప్రభాస్ డబుల్ రోల్ చేస్తున్నారంటూ కొత్త రూమర్స్ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో డార్లింగ్ ద్విపాత్రాభినయం చేయడం లేదంటూ ఫ్యాన్స్ అందున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం తెలియరాలేదు.

నిజానికి ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల హడావాడి నెలకొంది. దీంతో ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిన్న కల్కి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇదిలా ఉంటే.. భారతీయ ఇతిహాస గ్రంథాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.