కొత్త సినిమాల రిలీజ్‌కు శుక్రవారాన్ని మించిన ఆప్షన్ మరోటి ఉండదు. వీకెండ్‌కు పర్ఫెక్ట్ ముహూర్తంలా ఉంటుంది కాబట్టే నిర్మాతలంతా ఎప్పట్నుంచో ఫ్రైడేను లాక్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ మారిపోతుంది. ఈ మధ్య చాలా సినిమాలకు గురువారాన్ని లాక్ చేస్తున్నారు నిర్మాతలు. తాజాగా కల్కి సినిమానే దీనికి నిదర్శనం. జూన్ 27న గురువారం రోజు కల్కి రానుంది.