Pawan Kalyan: పవన్, హరీశ్ శంకర్ సినిమాపై క్రేజీ అప్‌డేట్.. పవర్ స్టార్‌తో మరోసారి జతకట్టనున్న బ్యూటీ..
Pawan Kalyan Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ.. వకీల్‌సాబ్ తర్వాత సినిమాల్లో వేగం పెంచారు. వరుస సినిమాలను ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు పవన్. ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించి మునుపెన్నడూ లేని విధంగా...

Pawan Kalyan Harish Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ.. వకీల్‌సాబ్ తర్వాత సినిమాల్లో వేగం పెంచారు. వరుస సినిమాలను ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపారు పవన్. ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించి మునుపెన్నడూ లేని విధంగా సినిమాల్లో వేగం పెంచారు పవర్‌స్టార్. పవన్ నటిస్తోన్న సినిమాల్లో డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఒకటి. పవన్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడు తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

Pawan Samantha
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధిచిన ఓ అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తినిరేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో పవన్ సరసన అక్కినేని వారి కోడలు సమంత నటించనుందనేది సదరు వార్త సారాంశం. అత్తారింటికి దారేది చిత్రంలో సమంత తళుక్కుమన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే వివాహం తర్వాత ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటన్న సమంత ఈ సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చారిత్రక చిత్రం శాకుంతంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. మరి సమంత మరోసారి పవన్ సరసన నటించనుందని వస్తోన్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Drishyam’s Chinese remake: చైనీస్ భాషలోకీ రీమేక్ కానున్న సూపర్ హిట్ సినిమా..
Kamal Haasan: కమల్ హాసన్ కు తప్పని కథానాయిక కష్టాలు.. లోకనాయకుడు ఆ హీరోయిన్ తో సినిమా చేయనన్నారా..?




