Ileana D’Cruz: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. అతను ఎవరంటే
హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేమలో పడటం, బ్రేకప్ జరిగిపోవడం.. ఆతర్వాత డిప్రషన్ లోకి వెళ్లడం అంతా చకచకా జరిగిపోయాయి. అదే సమయంలో ఇలియానా చాలా లావుగా మారిపోయింది.

హాట్ బ్యూటీ ఇలియానా ప్రస్తుతం సినిమాలు తగ్గించిన విషయం తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ భామ. ఆతర్వాత తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అలాగే హిందీలోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ హిందీలో ఆశించిన స్తాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈ అమ్మడు మూవీ కెరీర్ ముగిసిపోయింది. హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేమలో పడటం, బ్రేకప్ జరిగిపోవడం.. ఆతర్వాత డిప్రషన్ లోకి వెళ్లడం అంతా చకచకా జరిగిపోయాయి. అదే సమయంలో ఇలియానా చాలా లావుగా మారిపోయింది. తెలుగులో తిరిగి ఎంట్రీ ఇవ్వాలని చేసింది. రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటించింది. కానీ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ సినిమాల్లో నటించలేదు ఇలియానా.
ఇక ఇప్పుడు తిరిగి సన్నజాజిలా మారిపోయింది. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే ఇలియానా నిత్యం హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాను ప్రగ్నెంట్ అని షాక్ ఇచ్చింది. బేబీ బంప్ తో ఫోటోలను షేర్ చేసింది. ప్రతి రోజు తన బేబీ బంప్ ఫోటోలను నెట్టింట పంచుకుంది.
అయితే ఇంతవరకు ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఎవరి అన్నది మాత్రం చెప్పలేదు. తన బాయ్ ఫ్రెండ్ ఎవరు అన్నది ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ను రివీల్ చేసింది. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఫోటోను షేర్ చేసింది. అయితే ఇలియానా కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా లవ్ లో ఉందని.. గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఈ ఫొటోలో ఉన్నది మాత్రం సెబాస్టియన్ కాదు అని అంటున్నారు. మరి అతడి పేరు ఇలియానా బయటపెడుతుందేమో చూడాలి.
Ileana
