AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mohan Babu: హైదరాబాద్ నుంచి సొంత జిల్లాకు చేరిన మంచు ఫ్యామిలీ ఫైట్.. అసలు ఏం జరుగుతోంది?

విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం కొద్ది రోజులుగా రోడ్డెక్కింది. ఫిర్యాదులు కేసులు, ఆరోపణలు టెక్కించిన మంచు ఫ్యామిలీ ఫైట్ ఇప్పుడు హైదరాబాదు నుంచి సొంత జిల్లాకు చేరింది. దీంతో చర్చ నడుస్తోంది. మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందని స్థానికుల్లో చర్చగా మారింది.

Mohan Babu: హైదరాబాద్ నుంచి సొంత జిల్లాకు చేరిన మంచు ఫ్యామిలీ ఫైట్.. అసలు ఏం జరుగుతోంది?
Manchu Family
Raju M P R
| Edited By: |

Updated on: Jan 19, 2025 | 2:54 PM

Share

అభిమానులు, ఆత్మీయులు, బంధువులు సన్నిహితుల మధ్య మోహన్ బాబు ఫ్యామిలీ మేటర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అటు తెలంగాణలో ఇటు ఏపీలో కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారిపోయింది. సంక్రాంతి పండుగకు వచ్చి సంతోషంగా గడపాల్సిన మంచి ఫ్యామిలీలో ఏమిటి రచ్చ అనుకుంటున్న పరిస్థితి నెలకొంది. సంక్రాంతి పండుగకు ముందుగానే శ్రీ విద్యానికేతన్ కు చేరుకున్న మోహన్ బాబు, విష్ణు ఫ్యామిలీ సంతోషంగా పండుగ జరుపుకుంటుండగా కనుమ రోజు మనోజ్ ఎంట్రీ శ్రీ విద్యానికేతన్ వద్ద హైడ్రామాకు తెర తీసింది. ఇందులో భాగంగా జరిగిన గొడవలు తిరుపతి జిల్లా చంద్రగిరి పిఎస్ లో రెండు కేసులు నమోదుకు కారణమయ్యాయి నాలుగు రోజుల క్రితం మోహన్ బాబు విద్యాసంస్థల వద్ద జరిగిన ఘటన లపై పోలీసుల దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఇరు వర్గాలను విచారించేందుకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు.

శ్రీ విద్యానికేతన్ పక్కనున్న డెయిరీ ఫాం వద్ద జరిగిన ఘటనపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్, మౌనిక దంపతులతో పాటు పళణి రాయల్, రెడ్డి పవన్ తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. 329(3)351(2)r/w3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక మనోజ్ పిర్యాదు తో మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ నాయుడు తో పాటు MBU సిబ్బంది 8 మందిపై కేసు నమోదు అయ్యింది. తనపై, భార్య మౌనిక లపై దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు లో మనోజ్ పేర్కొనడంతో విజయ్ సింహ, సురేంద్ర, బాలాజీ, సారథి, కిరణ్, రవి శేఖర్, హేమాద్రి, జిఎం చంద్రశేఖర్, ఎంవీఎస్ మని లపై కేసు నమోదు చేశారు పోలీసులు. 126(2)191(2)191(3)351(2)r/w190 BNS సెక్షన్ల కింద నమోదైన కేసులో దర్యాప్తు కూడా ప్రారంభమైంది.

ఇక ఇప్పటికే ఎక్స్ లోనూ మంచు బ్రదర్స్ ఫైట్ కొనసాగుతోంది. ఎక్స్ వేదికగానూ అన్నదమ్ముల మధ్య వార్ నడుస్తోంది. చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని MBU వద్ద జరిగిన గొడవలపై స్పందించిన మంచు విష్ణు ఎక్స్ లో చేసిన పోస్ట్ కు మనోజ్ కౌంటర్ పోస్ట్ చేయడం మరో చర్చగా మారింది. కొత్త వివాదానికి తెర తీసింది. మోహన్ బాబు నటించిన రౌడీ సినిమాలోని సింహం అవ్వాలని ప్రతి కుక్కకు ఉంటుంది. వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావనే ఆశ’ ఆన్న డైలాగ్ పిక్ తో సహా ఉన్న ఆడియోను పోస్ట్ చేసారు విష్ణు. ఈ డైలాగ్ తనకి చాలా ఇష్టమని కామెంట్ చేసిన విష్ణుకు కౌంటర్ గా మనోజ్ ఎక్స్ లో చేసిన ట్వీట్ ఆసక్తిగా మారింది. భక్త కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు లాగా సింహం అవ్వాలని మోసం చేసే ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది. ఈ విషయం నువ్వు ఇదే జన్మ లో తెలుసుకుంటా వంటూ ట్వీట్ చేసారు మనోజ్. ఇలా ఇద్దరు అన్నదమ్ముల మధ్య సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో జరుగుతున్న వార్ మంచు ఫ్యామిలీ ఫైట్ పిక్స్ కు చేరుకునేలా చేసింది.