Salaar: కొత్త సంవత్సరం వేడుకలు.. ప్రభాస్‌ను వాడేసిన హైదరాబాద్ పోలీసులు.. వైరల్ వీడియో చూశారా?
మందుబాబులకు ముందే స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇందుకోసం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌ను వాడేసుకున్నారు. సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్' సినిమాలో 'ముట్టుకోవద్దని చెప్పాను కదరా' అని ప్రభాస్ నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడిదే డైలాగ్‌ను తమ డ్రంక్ అండ్ డ్రైవ్ యాడ్‌లో వాడారు హైదరాబాద్ సిటీ పోలీసులు.

మరికొన్ని గంటల్లో 2023కు ఎండ్ కార్డ్ పడనుంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏ రేంజ్‌లో జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మద్యం ఏరులై పారాల్సిందే. పబ్బులు, క్లబ్బులకు కూడా అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ మందు తాగిన తర్వాత వాహనాలు నడిపి ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వారు కోకోల్లలు. ప్రభుత్వం, పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఆగడం లేదు. కొత్త సంవత్సరం జోష్ లో ఇలాంటి ప్రమాదాలు మరింత పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో మందుబాబులకు ముందే స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇందుకోసం పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌ను వాడేసుకున్నారు. సలార్: పార్ట్ 1 సీజ్ ఫైర్’ సినిమాలో ‘ముట్టుకోవద్దని చెప్పాను కదరా’ అని ప్రభాస్ నోటి వెంట వచ్చిన ఈ డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. ఇప్పుడిదే డైలాగ్‌ను తమ డ్రంక్ అండ్ డ్రైవ్ యాడ్‌లో వాడారు హైదరాబాద్ సిటీ పోలీసులు. మందు ముట్టుకోవద్దంటూ ఇన్ డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చారు. అలాగే మందు తాగి వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ కొన్ని విజువల్స్ కూడా జత చేశారు. ఇక చివరిలో ‘ప్లీజ్ ఐ కైండ్ లీ రిక్వెస్ట్’ డైలాగ్ ను కూడా జత చేశారు. ప్రభాస్ సలార్‌లోని డైలాగులను వాడుతూ హైదరాబాద్ సిటీ పోలీసులు రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.
ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్,శ్రియారెడ్డి, బాబీ సింహ, టిను ఆనంద్, కన్నడ గరుడ రామచంద్ర, మధు గురుస్వామి, బాబీ సింహా, బ్రహ్మాజీ, నవీన్ పంజు, బజరంగీ లోకి, దేవరాజ్, సప్తగిరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 22న విడుదలైన సలార్ రికార్డులు బద్దలు కొడుతోంది. ఇప్పటికే రూ.600 కోట్లు దాటేసింది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడంతో రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలవుతాయంటున్నారు ట్రేడ్ నిపుణులు.
హైదరాబాద్ సిటీ పోలీసులు షేర్ చేసిన వీడియో..
“Don’t let one night of fun turn into a lifetime of guilt.” Don’t Drink & Drive, Stay Safe.#DriveSafe #DontDrinkAndDrive #ArriveAlive #RoadSafety #SaveLives #Salaar #HyderabadCityPolice pic.twitter.com/e8HYJN5la7
— Hyderabad City Police (@hydcitypolice) December 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




