సంక్రాంతి బరిలో గ్లామర్ వార్.. పోటి పడుతున్న క్రేజీ బ్యూటీస్
ఇప్పటి వరకు అంతా సంక్రాంతి బరిలో పోటి పడుతున్న సినిమాలు, హీరోల గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ సినిమాలతో వెండితెర మీద జరగబోయే గ్లామర్ వార్ గురించి మాత్రం పెద్దగా బజ్ రావటం లేదు. కానీ ఈ సంక్రాంతి చాలా మంది హీరోయిన్స్‌కు ఎంతో ఇంపార్టెంట్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా రిలీజ్ అవుతున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమాతో టాప్ స్టార్స్‌కు జోడిగా ప్రమోట్ అవుతున్నారు శ్రీలీల. ఇప్పటికే రిలీజ్ అయిన అప్‌డేట్స్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా సక్సెస్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది యూనిట్.
Updated on: Dec 31, 2023 | 6:31 PM

ఇప్పటి వరకు అంతా సంక్రాంతి బరిలో పోటి పడుతున్న సినిమాలు, హీరోల గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ సినిమాలతో వెండితెర మీద జరగబోయే గ్లామర్ వార్ గురించి మాత్రం పెద్దగా బజ్ రావటం లేదు. కానీ ఈ సంక్రాంతి చాలా మంది హీరోయిన్స్‌కు ఎంతో ఇంపార్టెంట్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

సంక్రాంతి బరిలో హాట్ ఫేవరెట్‌గా రిలీజ్ అవుతున్న మూవీ గుంటూరు కారం. ఈ సినిమాతో టాప్ స్టార్స్‌కు జోడిగా ప్రమోట్ అవుతున్నారు శ్రీలీల. ఇప్పటికే రిలీజ్ అయిన అప్‌డేట్స్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా సక్సెస్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది యూనిట్. అందుకే శ్రీలీల కూడా ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్‌లో వచ్చేస్తానని గట్టిగా నమ్ముతున్నారు.

ఈ సీజన్‌లో రిలీజ్ అవుతున్న మరో క్రేజీ మూవీ హనుమాన్. ఫాంటసీ డ్రామా కావటంతో మేజర్‌గా హీరో మీదే ఫోకస్ కనిపిస్తున్నా.. హీరోయిన్‌ది కూడా ఇంపార్టెంట్ రోలే అంటోంది చిత్రయూనిట్. అందుకే ఈ సినిమాతో ప్రూవ్, చేసుకొని హీరోయిన్‌గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అమృత్ అయ్యర్.

వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న సైంధవ్‌తో మరోసారి టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. సక్సెస్‌ఫుల్ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా శ్రద్ధాకు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. అందుకే సంక్రాంతి సినిమా సైంధవ్ మీద ఆశలు పెట్టుకున్నారు.

రవితేజ హీరోగా రూపొందుతున్న ఈగల్ సినిమాతో ఇద్దరు హీరోయిన్లు బరిలో దిగుతున్నారు. ప్రజెంట్ మంచి ఫామ్‌లో ఉన్న అనుపమా మరో సక్సెస్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు ప్రయాత్నాలు చేసిన కావ్య థాపర్ కూడా ఈగల్ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు.

ఇంకా డేట్ లాక్ చేయకపోయినా.. సంక్రాంతి బరిలో దిగేందుకు రెడీ అవుతున్న మూవీ నా సామి రంగ. ఈ సినిమా టాలీవుడ్‌లోనూ సక్సెస్ కొట్టాలన్న ఆశతో ఉన్నారు ఆశికా రంగనాథ్. గతంలో కల్యాణ్ రామ్ సరనస చేసిన అమిగోస్‌తో సక్సెస్ మిస్ అయినా, ఈ సారి మాత్రం హిట్ గ్యారెంటీ అని గట్టిగా నమ్ముతున్నారు. మరి ఈ ముద్దుగుమ్మల్లో ఎంతమందిని సక్సెస్ వరిస్తుందో చూడాలి.




