AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hari Hara Veera Mallu : పవన్ సినిమా కోసం అదిరిపోయే సెట్లు వేస్తున్న డైరెక్టర్ క్రిష్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడుమీదున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ఇప్పటికే ప్రేక్షకులను అలరించిన పవన్ త్వరలో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ తో...

Hari Hara Veera Mallu : పవన్ సినిమా కోసం అదిరిపోయే సెట్లు వేస్తున్న డైరెక్టర్ క్రిష్..
Rajeev Rayala
|

Updated on: Jun 30, 2021 | 7:45 AM

Share

Hari Hara Veera Mallu :

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూకుడుమీదున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ఇప్పటికే ప్రేక్షకులను అలరించిన పవన్ త్వరలో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రానుకున్నాడు. సినిమాతోపాటు క్రిష్ డైరెక్షన్ లో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. దాదాపు 150 కోట్లతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా పీరియాడిక్ మూవీ అవ్వడంతో భారీ సెట్టింగ్ లు వేయిస్తున్నారు. ఇప్పటికే ఛార్మినార్ సెట్ ను వేశారని ఈ మధ్య వార్తలు వచ్చాయి. ఛార్మినార్ సెట్ తోపాటుగా మరికొన్ని సెట్ లు కూడా వేస్తున్నారట. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆగ్రా కోట సెట్టింగ్ వేయిస్తున్నారట. జులై నెలలో ఈ సినిమా షూటింగ్ అక్కడే జరుగుతుందని అంటున్నారు. హరిహర వీరమల్లు సినిమాలో కీలక సన్నివేశాలను ఇక్కడ షూట్ చేయనున్నారట.

ఛార్మినార్ , ఆగ్రా కోట సెట్లు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. అలాగే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యి నెట్టింట హల్ చల్ చేస్తుంది. పవన్ మల్ల యోదులతో తలపడేందుకు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వారిని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. క్రిష్ ఈ సినిమా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.అలాగే పవన్ నటిస్తున్న మొట్టమొదటి చారిత్రాత్మక సినిమాకావడంతో అభిమానులంతా ఆసక్తిగా సినిమాకోసం ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ వీరాభిమాని పాదయాత్ర.. పవన్‌ను కలిసేందుకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి హైదరాబాద్‌కు..!

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కు హోస్టుగా నాగార్జున తప్పుకున్నారా..? ఆయన స్థానంలో యంగ్‌ హీరో..?

Manjima Mohan: రిలేషన్‏షిప్ స్టేటస్ అడిగిన నెటిజన్… ఫన్నీగా ఆన్సర్ ఇచ్చిన హీరోయిన్..