AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hombale Films: హోంబలే ఫిలిమ్స్ దూకుడు.. ఏకంగా 7 సినిమాలను అనౌన్స్ చేసిన మేకర్స్

హోంబాలే ఫిల్మ్స్ చాలా తక్కువ కాలంలోనే భారతదేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలలో ఒకటిగా మారింది. భారీ బడ్జెట్ సినిమాలతో పాటు, హోంబాలే సంస్కృతి, పౌరాణిక కథలను కూడా గొప్పగా తెరపైకి తీసుకువస్తోంది. హోంబాలే చిత్ర నిర్మాణంలో కొత్త సాహసాలు చేస్తోంది. కొన్ని నెలల క్రితం, హోంబాలే ఫిల్మ్స్ నటుడు ప్రభాస్‌తో మూడు సినిమాలను ప్రకటించింది.

Hombale Films: హోంబలే ఫిలిమ్స్ దూకుడు.. ఏకంగా 7 సినిమాలను అనౌన్స్ చేసిన మేకర్స్
Hombale Films
Rajeev Rayala
|

Updated on: Jun 25, 2025 | 3:59 PM

Share

హోంబలే ఫిలిమ్స్.. తక్కువ సమయంలోనే బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మారిపోయింది. కన్నడ పరిశ్రమకు చెందిన ఈ నిర్మాణ సంస్థ స్టార్ హీరోల  సినిమాలను నిర్మిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. కన్నడ సినిమాలకు మార్కెట్ లేదు. పరిమిత బడ్జెట్‌తో మాత్రమే సినిమాలు నిర్మించాలనే చర్చ నడుస్తున్న సమయంలో, ఈ నిర్మాణ సంస్థ ఊహించని బడ్జెట్‌తో చిత్రాలను నిర్మించడమే కాకుండా, దేశవ్యాప్తంగా కన్నడ చిత్రాలను పరిచయం చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఏడాదికేడాది తన పరిధిని విస్తరిస్తున్న హోంబాలే ఫిల్మ్స్, ఇప్పుడు మలయాళం, తెలుగు , తమిళంతో పాటు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 , కాంతార, సలార్ సినిమాలతో హోంబలే ఫిలిమ్స్ పేరు మారుమ్రోగింది. ఇక ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలను ప్రేక్షకులను అందించాడని రెడీ అవుతుంది.

ఇది కూడా చదవండి : ఎవర్రా మీరంతా..! వెంకీ రీ రిలీజ్‌లో ఈ అమ్మాయిలు చూడండి ఏం చేశారో..

కొన్ని నెలల క్రితం, హోంబలే ఫిల్మ్స్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మూడు సినిమాలను ప్రకటించింది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తోనూ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. తాజాగా ఏకంగా 7 సినిమాలను అనౌన్స్ చేసింది. మహావతార్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా 7 సినిమాలు తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. మహావతార్‌: నరసింహ (25 జులై 2025), మహావతార్‌ : పరశురామ్‌ (2027), మహావతార్‌ : రఘునందన్‌ (2029), మహావతార్‌ : ద్వారకాదీశ్‌ (2031), మహావతార్‌ : గోకులానంద్‌ (2033), మహావతార్‌ : కల్కి 1 (2035), మహావతార్‌ : కల్కి 2 (2037) సినిమాలను అనౌన్స్ చేసింది హోంబలే ఫిలిమ్స్.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : చేసింది ఒకేఒక్క సినిమా..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్‌లో దారుణంగా..

మహావతార విశ్వం’లోని విష్ణువు అవతారాల ఆధారంగా హోంబాలే చిత్రాలను నిర్మించనుంది. అయితే ఈ చిత్రాలన్నీ యానిమేటెడ్ సినిమాలా..? లేక  చలనచిత్రాలా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ‘మహావతార విశ్వం’ను ప్రకటిస్తూ హోంబాలే మేకర్స్ మాట్లాడుతూ.. ‘అవకాశాలు అంతులేనివి. మా పాత్రలు తెరపై గర్జించడం చూడటానికి మేము ఉత్సాహంగా ఉన్నాము. అద్భుతమైన సినిమా ప్రయాణానికి సిద్ధంగా ఉండండి’ అని అన్నారు. త్వరలోనే సలార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది హోంబలే ఫిలిమ్స్.

ఇది కూడా చదవండి: ఈ ఒక్క సీన్ థియేటర్స్‌ను షేక్ చేసింది.. అర్జున్ రెడ్డిలో ఈమె గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి