చేసింది ఒకేఒక్క సినిమా..! లవర్ బాయ్ క్రేజ్.. కట్ చేస్తే రోడ్ యాక్సిడెంట్‌లో దారుణంగా..
టాలీవుడ్ లో ఎంతో మంది సహీరోలు.. లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అందులో ఈ హీరో ఒకరు.. చేసింది ఒకే ఒక్క సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. తొలి సినిమానే భారీ హిట్.. లవర్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

ప్రతివారం ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి.. ఎన్ని సినిమాలు విడుదలైన సరే కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండి పోతాయి. అలాంటి వాటిలో ఈ హీరో సినిమా ఒకటి.. ఆ హీరో చేసింది ఒకే ఒక్క సినిమా అది కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ చాలా మంది అభిమాన సినిమా అది. సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ హీరో స్టార్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు..తొలి సినిమాతోనే లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న అతను.. ఆతర్వాత ఊహించని విధంగా ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఇంతకూ ఆ హీరో ఎవరో తెలుసా.? ఓ హీరోయిన్ పుట్టిన రోజు కోసం వస్తూ యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు.. ఇంతకూ ఆ హీరో ఎవరంటే..
ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..
ప్రేమ కథలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎన్నో లవ్ స్టోరీస్ ఇప్పటికే సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి వాటిలో ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా ఒకటి. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమ కథ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు యశో సాగర్. ఈ సినిమాలో హీరోయిన్ గా స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది
అయితే ఈ సినిమా తర్వాత యశో సాగర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. యశోసాగర్ పూణే నుండి బెంగళూరుకు వస్తుండగా 2012 డిసెంబర్ 25న రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రోడ్డు ప్రమాదంలో యశోసాగర్ స్నేహితుడు విశ్వనాథరెడ్డి కూడా మరణించాడు. అయితే స్నేహ ఉల్లాల్ పుట్టిన రోజు కోసం వస్తుంటేనే ప్రమాదం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఆ వార్తల్లో నిజం లేదని తెలిసింది. యశో సాగర్ మిస్టర్ ప్రేమికుడు అనే మరో తెలుగు చిత్రంలో కూడా నటించాడు. కానీ యశోసాగర్ మరణానంతరం ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు.
ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




