- Telugu News Photo Gallery Cinema photos Nidhhi Agerwal latest sizzling looks in trendy dress goes viral in internet
Nidhhi Agerwal: ఈ కాంత తన అందంతో కుర్రాళ్లను ఇట్టే ఆకర్షిస్తుంది.. సిజ్లింగ్ నిధి..
నిధి అగర్వాల్.. చేసిండు తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తెలుగు కుర్రాళ్ల క్రష్ లిస్టులో చేరిపోయింది. నాగ చైతన్య జోడిగా తెలుగు పరిచయం అయినా ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ సరసన పాన్ ఇండియా సినిమా చేస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో క్రేజి ఫొటోలతో హల్చల్ చేస్తుంది. అలాగే ఈసారి కూడా కొన్ని సిజ్లింగ్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Updated on: Jun 24, 2025 | 11:31 AM

17 ఆగస్టు 1993న తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జన్మించింది వయ్యారి భామ నిధి అగర్వాల్. పెరిగింది మాత్రం బెంగుళూరులో. హిందీ మాట్లాడే మార్వాడీ కుటుంబంలో జన్మించినప్పటికీ తెలుగు, తమిళం, కన్నడ భాషలను అర్థం చేసుకోవడంతోపాటు మాట్లాడగలదు ఈ బ్యూటీ.

2014లో మిస్ దివా యూనివర్స్ పోటీల్లో పాల్గొంది అందాల భామ నిధి అగర్వాల్. ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. హిందీలో మున్నా మైకెల్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ కు మకాం మార్చింది.

2018లో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు చలన చిత్ర అరంగేట్రం చేసింది. ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయిన తెలుగులో మంచి క్రేజ్ అందుకుంది. తర్వాత వరుస సినిమాలు క్యూ కట్టాయి.

2019లో అక్కినేని అఖిల్‌కు జోడిగా మిస్టర్ మజ్ను సినిమా సినిమాలు ఫ్లాప్ అయింది. అదే పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ బ్యూటీకి భారీ హిట్ అందించింది. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

ఇక ఇప్పుడు తెలుగు పవన్ కళ్యాణ్ సరసన నటించిన హరిహర వీరమల్లు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ప్రభాస్‌కి జోడిగా ది రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది ఈ మూవీ డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.




