Sapthami Gowda: కేకపెట్టించిన కన్నడ భామ.. కాంతార బ్యూటీ క్యూట్ క్యూట్ ఫొటోస్
కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సప్తమి గౌడ.. కన్నడలో సప్తమి గౌడ ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ‘ కాంతార ‘ సినిమాలో ఛాన్స్ అందుకుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
Updated on: Jun 24, 2025 | 3:01 PM

కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది సప్తమి గౌడ.. కన్నడలో సప్తమి గౌడ ‘పాప్‌కార్న్ మంకీ టైగర్’ సినిమాతో విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ‘ కాంతార ‘ సినిమాలో ఛాన్స్ అందుకుంది.

రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హిందీ సినిమాల్లోకి కూడా అడుగు పెట్టింది సప్తమి. కాంతార సినిమా తర్వాత ఈ చిన్నది సైలెంట్ అయ్యింది. చాలా కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు టాలీవుడ్ సినిమాతో రాబోతుంది.

నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది సప్తమీ గౌడ. ఈ సినిమాలో ఆమె ఓ గిరిజన యువతిగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తమ్ముడు సినిమాతో పాటు కాంతార 2లోనూ నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా కాంతార సూపర్ హిట్ అయిన తర్వాత ఆమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఈ అమ్మడు మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. ‘ది వాక్సిన్ వార్’ సినిమా ద్వారా హిందీ చిత్రసీమకు పరిచయమైన సప్తమి ఇప్పుడు తెలుగులో అడుగు పెడుతుంది.

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రష్మిక, శ్రీలీలలా ఈ అమ్మడు కూడా స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ అమ్మడు.




