- Telugu News Photo Gallery Cinema photos Actress chandini chowdary shares her latest white saree photos
తెల్ల చీరలో దేవకన్యలా మెరిసిన కలర్ ఫోటో భామ.. చాందిని ఫోటోలకు ఫిదా అవ్వాల్సిందే
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు.. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది ఈ అందాల భామ. ఆ తర్వాత కుందనపుబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది.
Updated on: Jun 24, 2025 | 3:07 PM

షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు.. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది ఈ అందాల భామ.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. ఆ తర్వాత కుందనపుబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. అలాగే కలర్ ఫోటో సినిమాతో పేక్షకులను మెప్పించింది. కలర్ ఫోటో సినిమాలో చాందిని చౌదరి తన నటనతో ఆకట్టుకుంది.

ఈ మూవీ తర్వాత చాందిని చౌదరికి వరుస ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దాంతో ఈ బ్యూటీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా లేదా చిన్న రోల్స్ లో కనిపిస్తుంది. అలాగే ఇటీవల బాలయ్య డాకు మహారాజ్ సినిమాలోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ.

సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది చాందిని. కానీ ఈ బ్యూటీకి స్టార్ డమ్ మాత్రం రావడం లేదు. హీరోయిన్ గా చేసినా.. సెకండ్ హీరోయిన్ గా చేసిన అనుకున్నంత గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు పంచుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది తెల్ల చీరలో అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఈ బ్యూటీ క్యూట్ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దేవకన్యలా ఉన్నారు అంటూ కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.




