- Telugu News Photo Gallery Cinema photos Ivana latest dazzling looks in trendy dress goes viral in social media
Ivana: ఆ జాబిల్లి నేలకి చేరి ఈ సుకుమారిలో ఐక్యం అయింది.. డేజ్లింగ్ ఇవానా..
ఇవానా.. ఈమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చేసింది ఓ సినిమా అయినప్పటికి తెలుగు కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. ఈమె అసలు పేరు అలీనా షాజీ. లవ్ టుడేలో నిఖిత పాత్రతో బాగా గుర్తింపు పొందింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మరి మీరు కూడా ఈ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.
Updated on: Jun 24, 2025 | 10:34 AM

25 ఫిబ్రవరి 2000న కేరళలోని చంగనాచెరిలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఇవానా. అలీనా షాజీ ఈమె అసలు పేరు. ఈ వయ్యారి తండ్రి పేరు షాజీ చెరియన్. లియో, లయ అనే ఇద్దరు కవల సోదరుడు, సోదరి కూడా ఉన్నారు ఈ ముద్దుగుమ్మకి.

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని కేరళ యూనివర్సిటీ నుంచి బికామ్ డిగ్రీ పట్టా పొందింది ఈ వయ్యారి. 12 ఏళ్ల వయస్సులోనే 2012 మలయాళీ చిత్రం మాస్టర్స్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది.

తమిళ చిత్రం నాచియార్‌లో ఈ బ్యూటీ నటనకి తమిళంలో సిమ్మా, ఫిల్మ్‌ఫేర్ వేదికల్లో ఉత్తమ డెబ్యూ నటిగా అవార్డులు అందుకుంది. 2022లో ప్రదీప్ రంగనాథన్‌కి జోడిగా తమిళ రొమాంటిక్ కామెడీ సినిమా లవ్ టుడేలో తొలిసారి కథానాయకిగా నటించింది.

తర్వాత 2023లో కోలీవుడ్ ఇండస్ట్రీలో LGM, మతిమారన్ అనే చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించింది ఈ అందాల భామ. 2024లో కల్వన్ అనే తమిళ్ కామెడీ డ్రామాలో హీరోయిన్గా కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 2025లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా తెరకెక్కిన డ్రాగన్ సినిమలో అతిధి పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ.

ఈ ఏడాది శ్రీవిష్ణు హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ సినిమా #సింగల్‌తో హీరోయిన్గా తెలుగు చలనచిత్ర తెరంగేట్రం చేసింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగులో ఈమెకు వరుస అవకాశాలు వచ్చేలా కనిపిస్తుంది.




