బాక్సాఫీస్‌ను రూల్ చేస్తున్న ఫాదర్ సెంటిమెంట్ కాన్సెప్ట్
సిల్వర్ స్క్రీన్ మీద ఒక ఫార్ములా సూపర్ హిట్ అయితే అదే ట్రెండ్‌ను మళ్లీ మళ్లీ రిపీట్ చేయటం అన్నది చాలా కామన్. ఇప్పుడు అలాంటి సక్సెస్ ఫార్ములనే మన సినిమాల్లో రెగ్యులర్‌గా కనిపిస్తోంది. టాప్ హీరోలు కూడా ఇదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు. స్టార్ హీరోల అప్ కమింగ్ సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Updated on: Jun 23, 2025 | 9:55 PM

స్టార్ హీరోల అప్ కమింగ్ సినిమాల్లో ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలో వస్తున్న సినిమాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్... ఇలా అందరూ హీరోలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

రీసెంట్‌గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలు ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే తెరకెక్కాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా సలార్.

తొలి భాగంలో తండ్రీ కొడుకులకు సంబంధించిన సీన్స్ లేకపోయినా... సీక్వెల్‌లో ఆ ఫ్లేవర్ ఉండబోతుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ది రాజాసాబ్ కూడా తాత సెంటిమెంట్‌తోనే తెరకెక్కుతోంది.

విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే పీరియాడిక్ మూవీ కూడా తండ్రీ కొడుకుల నేపథ్యంలోనే రూపొందనుంది. ఈ సినిమాలో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న రౌడీ హీరో, తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారు.

తెలుగులో మాత్రమే కాదు తమిళ, మలయాళ భాషల్లోనూ ఫాదర్ సెంటిమెంటే బాక్సాఫీస్‌ను రూల్ చేస్తోంది. రీసెంట్‌గా ఘన విజయం సాధించిన తుడరుమ్, టూరిస్ట్ ఫ్యామిలీ, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు కూడా ఫాదర్ సెంటిమెంట్ నేపథ్యంలోనే రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి.




