AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఒక్క సీన్ థియేటర్స్‌ను షేక్ చేసింది.. అర్జున్ రెడ్డిలో ఈమె గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో అర్జున్ రెడ్డి సినిమా ఒకటి. ఈ సినిమాతోనే విజయ్ దేవరకొండ స్టార్ గా మారిపోయాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విజయ్ నటన, స్టోరీ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

ఈ ఒక్క సీన్ థియేటర్స్‌ను షేక్ చేసింది.. అర్జున్ రెడ్డిలో ఈమె గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
Arjun Reddy
Rajeev Rayala
|

Updated on: Jun 24, 2025 | 10:38 AM

Share

విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ లో స్టార్ ను చేసిన సినిమా ఏది అంటే చిన్న పిల్లాడు కూడా టక్కున చెప్పే పేరు అర్జున్ రెడ్డి. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమాతో అటు విజయ్, ఇటు సందీప్ ఇద్దరి క్రేజ్ పెరిగిపోయింది. విజయ్ స్టార్ హీరోగా మారిపోయి వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అటు సందీప్ రెడ్డి పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ షాలిని పాండే ఒక్కతే సక్సెస్ కాలేకపోయింది. కేవలం హీరో దర్శకుడు మాత్రమే కాదు. ఈ సినిమాలో నటించిన చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : అప్పుడు మాస్ రాజా సినిమాలో సైడ్ రోల్.. ఇప్పుడు స్టార్ హీరో.. ఏకంగా రవితేజ మూవీలో గెస్ట్ గా..

అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ఇంట్రోలొ ఓ నటి కనిపిస్తుంది. హీరో క్యారెక్టర్ ను పరిచయం చేసే ఈ సన్నివేశంలో ఆమె కనిపిస్తుంది. ఆమె పేరు శ్రీసుధ. పలు సినిమాల్లో నటి శ్రీసుధ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. కాగా అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయ్యింది. ఆమెకు ఆ తర్వాత అవకాశాలు వచ్చినా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి : ఏం సినిమారా అయ్యా..! మెంటలెక్కి పోవాల్సిందే.. ఫ్యామిలీతో కలిసి చూడకపోవడం మంచిది

నటి శ్రీసుధ ఆ మధ్య వార్తల్లో నిలిచింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో శ్యామ్‌ కె.నాయుడుపై శ్రీసుధ చీటింగ్ కేసు పెట్టారు.ఆతర్వాత ఆమె పై హత్యాప్రయత్నం చేశాడు అంటూ కూడా కేసు పెట్టారు శ్రీసుధ. ఇక ఇప్పుడు ఆమె వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారిపోయింది. అడవుల్లో జంతువులను ఫోటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలకు నెట్టింట మంచి క్రేజ్ ఉంది. జంతువుల ఫోటోలతో పాటు అడపాదడపా తన ఫోటోలను, వీడియోలను కూడా షేర్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : గుర్తుందా మావ..! అప్పట్లో టిక్ టాక్‌ను ఊపేసిన ఈ అమ్మాయి.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్