భారీ బడ్జెట్ తో రామాయణం 3D ప్లాన్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్.. సినిమా కోసం రంగంలోకి ఏకంగా హాలీవుడ్ టెక్నీషన్స్

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.

భారీ బడ్జెట్ తో రామాయణం 3D ప్లాన్ చేస్తున్న మెగా ప్రొడ్యూసర్..  సినిమా కోసం రంగంలోకి ఏకంగా హాలీవుడ్ టెక్నీషన్స్
Allu Aravind

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. బాహుబలి సినిమా తర్వాత తెలుగులో పాన్ ఇండియా సినిమాలో హవా కొనసాగుతుంది. దాదాపు అందరు స్టార్ హీరోలు పాన్ ఇండియా సినిమాలపైనే కన్నేస్తున్నారు. ఇక నిర్మాతలు కూడా భారీ సినిమాలను తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఓ భారీ చిత్రాన్ని నిర్మించాలని చూస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత రామాయణం సినిమా తెరకెక్కించనున్నారని వార్తలు వినిపించాయి. ఈ సినిమాను అల్లు అరవింద్- మధు మంతెన- నమిత్ మల్హోత్రా సంయుక్తంగా దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమయ్యారని టాక్ నడిచింది. అంతే కాదు ఈ సినిమాలో రావణుడిగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, సీతగా దీపికాపదుకునే నటించనున్నారని కూడా వార్తలు వచ్చాయి.

అంతే కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీరాముడిగా నటిస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఆంజనేయుడు.. లక్ష్మణుడు.. భరత శత్రుఘ్నుల పాత్రలకు వాలి సుగ్రీవుల పాత్రలకు కూడా ఎంపికలు జరుగుతున్నాయని ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ అవతార్ కి పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్ల బృందం రామాయణం చిత్రానికి పని చేస్తుందని.. హృతిక్ రావణ్ పాత్ర కోసం డిజైన్స్ రూపొందించడానికి ముందుకు వచ్చిందని ఫిలిం సర్కిల్స్ లో జోరుగా టాక్ నడుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nikhil Siddharth: బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా యంగ్ హీరో.. నిఖిల్ ఖాతాలో మరో మూడు సి సినిమాలు.?

Puri: మ‌నకు జ‌బ్బులు రావ‌డానికి అస‌లు కార‌ణం అదే.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే.. పూరీ మార్క్ విశ్లేష‌ణ..

Pooja Hegde: అనుకున్న క‌ల‌ను సాధించాన‌ని చెబుతోన్న బుట్ట‌బొమ్మ‌.. ఇంత‌కీ పూజా క‌ల ఏంట‌నేగా..!

Kiara Advani: క‌చ్చితంగా మ‌రో తెలుగు సినిమాలో న‌టిస్తానంటోన్న కియారా.. ఆ చిత్రం ఎన్టీఆర్‌దేనా..?