Jr NTR : ఆస్కార్ నామినేషన్‌కు మన తారక రాముడు.. హాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్. నటన, డాన్స్, డైలాగ్ ఇలా ఎందులోనైనా తారక్ తర్వాతే ఎవరైనా అనేలా ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకున్నారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్( Jr NTR). నటన, డాన్స్, డైలాగ్ ఇలా ఎందులోనైనా తారక్ తర్వాతే ఎవరైనా అనేలా ప్రేక్షకుల చేత జేజేలు కొట్టించుకున్నారు తారక్. ఇక మాస్ సినిమాలకు తారక్ పెట్టింది పేరు. పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాలంటే బాలయ్య తర్వాత ఆ రేంజ్ లో తారక్ కె సాధ్యం.. ఇండస్ట్రీలో సింగిల్ టెక్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు మన తారక రాముడు. ఇక ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోతారు ఎన్టీఆర్. అయితే తాజాగా ఎన్టీఆర్ పేరు హాలీవుడ్ లో మారుమ్రోగుతోంది. ఇటీవల తారక్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.. ఆర్ఆర్ఆర్ లో సినిమాలో తారక్ కొమురం భీమ్ పాత్రలో నటించారు ఎన్టీఆర్.
కొమురం భీమ్ పాత్రలో తారక్ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కొమురం భీమ్ పాత్రలోని అన్ని ఎమోషన్స్ ను తారక్ అద్భుతంగా పలికించారు. ఈ సినిమా దేహశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ను ఆకట్టుకుంది. తాజాగా హాలీవుడ్ కు చెందిన వెరైటీ అనే మ్యాగజైన్ తారక్ గురించి ప్రస్తావించింది. తారక్ నటనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉంది అని సదరు మ్యాగజైన్ రాసుకొచ్చింది. దాంతో తారక్ అభిమానులంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. `ర్యాంక్ లేని` విభాగంలో ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డుకు అవకాశం ఉన్న పోటీదారులలో జూనియర్ ఎన్టీఆర్ ను ఒకరిగా వెరైటీ మ్యాగజైన్ రాసుకొచ్చింది. మరి ఈ వార్త నిజమై తారక్ నామినేట్ అవుతారో లేదో చూడాలి. ఆస్కార్ కు నిజంగానే ఆర్ఆర్ఆర్ సినిమా కానీ తారక్ కానీ నామినేట్ అయితే అది మన తెలుగు సినిమాకు దక్కే గౌరవం. చూడాలి మరి ఏంజరుగుతుందో..