AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DJ Tillu: డీజే టిల్లు రాధికా మారిపోయిందా.. నేహా ప్లేస్‌ను రీప్లేస్ చేసే బ్యూటీ ఆమేనా..?

టాలీవుడ్ లో కుర్ర హీరోలు దూసుకుపోతున్నారు. కొత్త కొత్త కథలతో సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణే డీజే టిల్లు. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది.

DJ Tillu: డీజే టిల్లు రాధికా మారిపోయిందా.. నేహా ప్లేస్‌ను రీప్లేస్ చేసే బ్యూటీ ఆమేనా..?
Dj Tillu
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2022 | 8:43 PM

Share

టాలీవుడ్ లో కుర్ర హీరోలు దూసుకుపోతున్నారు. కొత్త కొత్త కథలతో సూపర్ హిట్స్ అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణే డీజే టిల్లు(DJ Tillu). యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఆకట్టుకుంది. సిద్దు కామెడీ టైమింగ్, కథ సినిమాను మంచి హిట్ గా నిలిపాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తోంది. డీజే టిల్లు సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న వెంటనే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక ఇప్పుడు సీక్వెల్ కోసం కసరత్తులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే డీజే టిల్లు సినిమాలో మరో హైలైట్ గా నిలిచిన పాత్ర రాధికా. హీరో గర్ల్ ఫ్రెండ్ పాత్రలో నటించి మెప్పించింది అందాల భామ నేహశెట్టి. ఇప్పుడు సీక్వెల్ లో ఈ అమ్మడు ప్లేస్ రీప్లేస్ అవ్వనుందని తెలుస్తోంది.

నేహా శెట్టి ప్లేస్ లో ఓ క్రేజీ హీరోయిన్ ను అనుకుంటున్నారట మేకర్స్. రాధికా పాత్ర సీక్వెల్ లో మారనుందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ను సంప్రదిస్తున్నారట డీజే టిల్లు మేకర్స్. ఇప్పటికే ఈ అమ్మడిని సంప్రదించారని తెలుస్తోంది. హీరో తో పోటీగా అంతే ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ కావడంతో అనుపమ కూడా ఓకే చెప్పారని టాక్. ఇప్పటికే తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది ఈ చిన్నది. తాజాగా అనుపమ నటించిన కార్తికేయ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే 18 పేజెస్ సినిమాతో రానుంది అను. ఈ సినిమాలోనూ నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ఇక డీజే టిల్లు సీక్వెల్ లో అనుపమ కన్ఫామ్ అయ్యిందా అన్నదాని పై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో