Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jeevitha: ఎన్నికల్లో పోటీకి సై అంటోన్న జీవితారాజశేఖర్.. ప్రధాని మోడీ పాలన అద్భుతం అంటూ ప్రశంసల వర్షం

రాజశేఖర్, జీవిత దంపతులు గతంలోనే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. తనను పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు జీవిత. 

Jeevitha: ఎన్నికల్లో పోటీకి సై అంటోన్న జీవితారాజశేఖర్.. ప్రధాని మోడీ పాలన అద్భుతం అంటూ ప్రశంసల వర్షం
Jeevita Rajasekhar
Follow us
Surya Kala

|

Updated on: Aug 14, 2022 | 8:30 AM

Jeevitha Rajasekhar: తెలంగాణాలో (Telangana) రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజీపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్(Bandi Sanjay) చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.  ప్రముఖ   సీనియర్ నటి జీవితా రాజశేఖర్ బండి సంజయ్ పాద యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ తాను  ఎన్నికలల్లో పోటీకి తాను సిద్ధం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్, జీవిత దంపతులు గతంలోనే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.. తనను పార్టీ అధిష్టానం ఆదేశిస్తే.. ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానని చెప్పారు జీవిత.

అయితే తనకు తెలంగాణ నుంచే ఎన్నికల బరిలో దిగాలని ఉందని.. తెలిపారు. బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడుకు చేరుకుంది. ఈ యాత్రలో జీవిత పాల్గొని సందడి చేశారు. ప్రజలతో కలిసి వారి కష్టసుఖాలను గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో సెల్ఫీలు దిగారు. తనకు ఇద్దరు ఆడపిల్లలని.. అందుకే తల్లిగా మహిళల కష్టాలు గురించి తనకు తెలుసని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణా ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని.. అందుకనే మెరుగైన పాలన కోసం బీజేపీ అధికారంలోకి రావాలని చెప్పారు. బండి సంజయ్ సమర్థులైన నాయకుడు.. ప్రజల సమస్యలపై ఆయన స్పందించే తీరు అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ పనితీరు అద్భుతం అని ఆయన  పాలనలో  దేశం క్షేమంగా ఉంటుందని అనిపించే తాము బీజేపీలో చేరినట్లు చెప్పారు. దీంతో రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల రేస్ లో జీవితా రాజశేఖర్, రాజశేఖర్ దంపతులు ఉండనున్నారనే ప్రచారం మొదలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి