AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara Movie: బియాండ్ ఫెస్ట్‌లో ‘దేవర’ స్క్రీనింగ్.. షార్క్ సీన్ చూసి నోరెళ్లబెట్టిన విదేశీయులు.. వీడియో చూశారా.. ?

తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అక్కడి స్టేజ్ పై తారక్ మాట్లాడుతూ దేవర సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే బియాండ్ ఫెస్ట్ లో దేవర టీజర్, ట్రైలర్ ప్రదర్శించారు. అయితే అక్కడ దేవర ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు హాలీవుడ్ అడియన్స్.

Devara Movie: బియాండ్ ఫెస్ట్‌లో 'దేవర' స్క్రీనింగ్.. షార్క్ సీన్ చూసి నోరెళ్లబెట్టిన విదేశీయులు.. వీడియో చూశారా.. ?
Devara
Rajitha Chanti
|

Updated on: Sep 26, 2024 | 10:13 AM

Share

ప్రస్తుతం దేవర సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతుంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా రేపు (సెప్టెంబర్ 27న) థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు తారక్. దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో దేవర చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చింది. అలాగే అటు విదేశాల్లోనూ తారక్ సందడి చేస్తున్నారు. తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో ఎన్టీఆర్ పాల్గొన్నారు. అక్కడి స్టేజ్ పై తారక్ మాట్లాడుతూ దేవర సినిమాను చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలోనే బియాండ్ ఫెస్ట్ లో దేవర టీజర్, ట్రైలర్ ప్రదర్శించారు. అయితే అక్కడ దేవర ట్రైలర్ చూసి ఆశ్చర్యపోయారు హాలీవుడ్ అడియన్స్.

ముఖ్యంగా ఈ సినిమాలోని షార్క్ సీన్ చూసి నోరెళ్లాబెట్టారు. ట్రైలర్ అయ్యాక అందరూ లేచి నిల్చొని చప్పట్లతో మారుమోగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ట్రైలర్ చూసి అటు విదేశీయులు ఆశ్చర్యపోతున్నారు. ఇక సినిమా చూస్తే ఏమైపోతారో అంటూ కామెంట్స్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. ఈరోజు సాయంత్రం బియాండ్ ఫెస్ట్ లో దేవర సినిమా ప్రీమియం వేయనున్నారు. అటు తారక్ కూడా ఇదే ఫెస్ట్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూడనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరిన్ని అంచనాలు పెంచాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించే సమయంలో సినిమా గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయానని.. ఇదొక అద్భుతమైన యాక్షన్ డ్రామా అని అన్నారు. ప్రేక్షకులకు ఫ్రెష్ అనుభూతిని కలిగించాలనే 95 శాతం రీరికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేశామని.. దేవర సినిమా చూస్తున్నప్పుడు అవెంజర్స్, బ్యా్ట్ మ్యాన్ మూవీస్ వంటి హాలీవుడ్ చిత్రాలను చూసిన అనుభూతి కలుగుతుందని అన్నారు. దీంతో ఇప్పుడు దేవర చిత్రంపై మరింత హైప్ పెరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి
గుప్త నవరాత్రులు ప్రారంభం.. ఈ తప్పులు అస్సలు చేయకండి