AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: ఈ క్యూట్ చిన్నారి ఇప్పుడు బిగ్‏బాస్ హౌస్‏లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. తెలుగువారికి ఇష్టమైన అమ్మాయి.. 

బుల్లితెరపై నటిగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆ అమ్మాయి.. ఇప్పుడు అతిపెద్ద రియాల్టీ షోలో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతుంది. అబ్బాయిలతో పోటీపడి మరీ టాస్కులలో సత్తా చాటుతుంది. అమాయకత్వం.. అంతకు మించిన ఆత్మవిశ్వాసం.. టాస్కులలో ఎంతో ధైర్యంగా పోరాడుతూ అపోజిట్ మెంబర్స్ ను చిత్తు చేస్తుంది. ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయికి క్రేజ్ మరింత పెరుగుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Bigg Boss 8 Telugu: ఈ క్యూట్ చిన్నారి ఇప్పుడు బిగ్‏బాస్ హౌస్‏లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. తెలుగువారికి ఇష్టమైన అమ్మాయి.. 
Actress
Rajitha Chanti
|

Updated on: Sep 26, 2024 | 8:53 AM

Share

ప్రస్తుతం తెలుగులో బిగ్‏బాస్ సీజన్ 8 విజయవంతంగా కొనసాగుతుంది. సెప్టెంబర్ 1న గ్రాండ్ గా ప్రారంభమైన ఈషోలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అయితే ఇప్పటివరకు మొత్తం ముగ్గురు ఎలిమినేట్ కాగా.. ప్రస్తుతం 11 మంది హౌస్ లో ఉన్నారు. అందులో ఈ క్యూటీ కూడా ఒకరు. పైన ఫోటోను చూశారా.. ? తండ్రి ఒడిలో చిరునవ్వులు చిందిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి. బుల్లితెరపై నటిగా సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఆ అమ్మాయి.. ఇప్పుడు అతిపెద్ద రియాల్టీ షోలో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతుంది. అబ్బాయిలతో పోటీపడి మరీ టాస్కులలో సత్తా చాటుతుంది. అమాయకత్వం.. అంతకు మించిన ఆత్మవిశ్వాసం.. టాస్కులలో ఎంతో ధైర్యంగా పోరాడుతూ అపోజిట్ మెంబర్స్ ను చిత్తు చేస్తుంది. ఇప్పుడిప్పుడే ఆ అమ్మాయికి క్రేజ్ మరింత పెరుగుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే ప్రేరణ కంబం. తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ ప్రేక్షకులకు ఈ అమ్మాయి చాలా సుపరిచితమే. కన్నడ నటి అయినప్పటికీ తెలుగు అడియన్స్ కు బాగా దగ్గరైంది.

1996 జూన్ 18న జన్మించిన ప్రేరణ.. 2017లో కన్నడలో హర హర మహాదేవ్ సీరియల్ ద్వారా నటిగా మారింది. ఆ తర్వాత రంగనాయకి అనే సీరియల్ ద్వారా కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో చురకత్తె సినిమాతో కథానాయికగా మెప్పించింది. ఫిజిక్స్ టీచర్, పెంటగాన్ చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రేరణ.. 2021లో కన్నడ బిగ్ బాస్ షోలో పాల్గొంది. ఇక ఆ తర్వాత కృష్ణ ముకంద మురారి సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సీరియల్ అతి తక్కువ సమయంలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది. ఇందులో కృష్ణ పాత్రలో అల్లరి పిల్లగా కనిపించి తెలుగువారికి మరింత దగ్గరైంది.

అయితే ఈ సీరియల్ ను అనుహ్యంగా ముగించారు మేకర్స్. ఇక ఆ తర్వాత ఇటీవలే ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8లో నాల్గవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. మొదట్లో ఎమోషనల్ అమ్మాయిగా కనిపించిన ప్రేరణ.. టాస్కులలో మాత్రం స్ట్రాంగ్ గా ఉంటుంది. అబ్బాయిలు, అమ్మాయిలు అనే తేడా లేకుండా గట్టి పోటినిస్తుంది. ప్రస్తుతం ప్రేరణ చిన్నప్పటి ఫోటో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. గతేడాది తన స్నేహితుడు సుందరి శ్రీపాద్ ను వివాహం చేసుకుంది ప్రేరణ కంబం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?