- Telugu News Photo Gallery Cinema photos Actress sharvari wagh acted alpha movie in yash raj films, details here Telugu Heroines Photos
Sharvari Wagh: బాలీవుడ్‌లో నయా సెన్సేషన్ శార్వరి వాఘ్.! అదిరిపోయే అందాలతో..
బాలీవుడ్ నయా సెన్సేషన్ శార్వరీ వాఘ్. సినిమా సినిమాకీ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. లేటెస్ట్ గా యష్‌రాజ్‌ఫిల్మ్స్ లో ఆల్ఫా మూవీలో నటిస్తున్నారు. ఇప్పుడు శార్వరి ఏం మాట్లాడినా నార్త్ లో ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతోందంటేనే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. ఇంతకీ లేటెస్ట్ గా ఆమె ఏం చెప్పారు.? ఏం వైరల్ అవుతోంది.. అని ఆలోచిస్తున్నారా.?
Updated on: Sep 26, 2024 | 9:00 PM

బాలీవుడ్ నయా సెన్సేషన్ శార్వరీ వాఘ్. సినిమా సినిమాకీ తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. లేటెస్ట్ గా యష్‌రాజ్‌ఫిల్మ్స్ లో ఆల్ఫా మూవీలో నటిస్తున్నారు.

ఇప్పుడు శార్వరి ఏం మాట్లాడినా నార్త్ లో ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతోందంటేనే ఆమెకున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.. ఇంతకీ లేటెస్ట్ గా ఆమె ఏం చెప్పారు.? ఏం వైరల్ అవుతోంది.. అని ఆలోచిస్తున్నారా.?

సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇంకా పదేళ్లు కూడా కాలేదు.. అందులోనూ నటిగా కన్నా అసిస్టెంట్ డైరక్టర్‌గా చేసిన చిత్రాలే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు నటిగా మంచి పాజిటివ్ వైబ్‌తో దూసుకుపోతున్నారు శార్వరి.

ఈ ఏడాది అప్పుడే రెండు హిట్స్ అందుకున్నారు శార్వరి. ముంజ్య, వేదా సినిమాలు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయన్నది అందరూ అంటున్న మాట.

బంటీ ఔర్ బబ్లీ సమయంలోనే ఈ అమ్మాయిలో స్పార్క్ ఉందని ఫిక్సయింది ముంబై ఇండస్ట్రీ. ఇప్పుడు ఏకంగా యష్‌రాజ్ ఫిల్మ్స్ ఆల్ఫాలో యాక్షన్ రోల్‌కి శార్వరిని సెలక్ట్ చేసుకున్నారంటేనే, ఈ బ్యూటీ తనను తాను ఎలా మలచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

అసలు తన కెరీర్ సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలో నటిగానే మొదలైందని రీసెంట్‌గా గుర్తుచేసుకున్నారు శార్వరి. అయితే ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయిందట.

సంజయ్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసిన అనుభవం మాత్రం సొంతమైందట. ఎప్పటికైనా ఆయన సెట్లో నటిగా ప్రూవ్ చేసుకోవాలన్నదే తన డ్రీమ్ అంటున్నారు ఈ నయా సెన్సేషన్.




