HIT 3 : అర్జున్ సర్కార్ మాస్ పవర్ ఫుల్.. నాని ‘హిట్ 3’ గ్లింప్స్ వేరే లెవల్..

ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నాని.. ఈసారి మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు. గతంలో వచ్చిన హిట్ మీవీ సీక్వెల్ లో నటిస్తున్నట్లు తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ టైటిల్ తో వరుసగా సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే.

HIT 3 : అర్జున్ సర్కార్ మాస్ పవర్ ఫుల్.. నాని 'హిట్ 3' గ్లింప్స్ వేరే లెవల్..
Hit 3
Follow us

|

Updated on: Sep 05, 2024 | 6:53 PM

న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు వరుస చిత్రాలతో థియేటర్లలో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఇటీవలే సరిపోదా శనివారం మూవీతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. కొన్ని రోజులుగా ఈ మూవీ హిట్ ఎంజాయ్ చేస్తున్న నాని.. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఎప్పుడూ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న నాని.. ఈసారి మాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలతో అదరగొట్టేందుకు రెడీ అయ్యాడు. గతంలో వచ్చిన హిట్ మీవీ సీక్వెల్ లో నటిస్తున్నట్లు తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్ టైటిల్ తో వరుసగా సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా హిట్.. ది ఫస్ట్ కేస్ మూవీ ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత హిట్ 2 చిత్రంలో అడివి శేష్ హీరోగా నటించాడు. ఈమూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడంతా హిట్ 3 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిట్ 2 క్లైమాక్స్ లోనే మూడో భాగానికి నాని హీరోగా ఉంటాడని అనౌన్స్ చేశారు మేకర్స్. అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించనున్నాడని అప్పుడే క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రంలో నాని పాత్రను ఇంట్రడ్యూస్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో నాని పవర్ ఫుల్ మాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. పోలీస్ కు తక్కువ, విలన్ కు ఎక్కువ అన్నట్లుగా అర్జున్ సర్కార్ చార్జ్ తీసుకున్నాడు. అతడే పెద్ద ప్రమాదం.. అలాంటి ప్రమాదాలు అతడిని ఏమీ చేయలేవు అనే వచ్చే డైలాగ్స్ చూస్తే ఈ చిత్రంలో నాని రోల్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుస్తోంది. రక్తంతో తడిసిన యూనిఫాంను పక్కకు పెట్టి నాని కారులో రక్తపు గొడ్డలిని పెట్టుకోవడం చూస్తే ఈ చిత్రం వైల్డ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మే 1న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ మూవీలో నటించే హీరోయిన్, ఆర్టిస్టులతోపాటు మిగతా విషయాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

హిట్ 3 గ్లింప్స్ చూసేయ్యండి.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.