5

MAA Elections 2021: ‘మా’ ఎన్నికల పోటీల్లో ట్విస్ట్.. రంగంలోకి హిందూ సంఘాలు… ప్రకాష్ రాజ్ పెత్తనం ఒప్పుకోం అంటూ…

Prakash Raj: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు రోజుకు మరింత ఉత్కంఠంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నలుగురు పోటీదారులతో రాజకీయ

MAA Elections 2021: 'మా' ఎన్నికల పోటీల్లో ట్విస్ట్.. రంగంలోకి హిందూ సంఘాలు... ప్రకాష్ రాజ్ పెత్తనం ఒప్పుకోం అంటూ...
Prakash Raj
Follow us

|

Updated on: Jun 28, 2021 | 2:41 PM

Prakash Raj: టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు రోజుకు మరింత ఉత్కంఠంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు నలుగురు పోటీదారులతో రాజకీయ పోటీలను తలపించాయి. తాజాగా ‘మా’ అధ్యక్ష పదవికి స్వతంత అభ్యర్థిగా పోటీ చేస్తానని సీవీఎల్ అన్నారు. ఓ వైపు మెగా కంపాండ్ మద్దతు ప్రకాశ్ రాజ్ కు ఉందనే మాట ఎక్కువగా వినిపిస్తుండగా.. ఇటీవల నాగబాబు మాటలతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అటు బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ సపోర్ట్ మంచువారబ్బాయికి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక జీవితా రాజశేఖర్, నటి హేమ కు మద్దతు ఎవరు ఇస్తారనే సస్పెన్స్ ఉండగా.. నటుడు సీవీఎల్ రాకతో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఇదిలా ఉంటే.. మా ఎన్నికలలో ఇప్పుడు హిందూ సంఘాల వాదన వినిపిస్తోంది.

నటుడిగా ప్రకాష్ రాజ్ ను గౌరవిస్తాం..అభిమానిస్తాం.. పెత్తనం చేస్తానంటే ఒప్పుకోం అని హిందూ సంఘాలు వాదిస్తున్నారు. నటుడు ప్రకాష్ రాజ్ కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు నిలుస్తున్నాయి. హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న ప్రకాష్ రాజ్ గతంలో హిందువులను కాకులతో పోల్చాడు. అతను గెలిస్తే హిందూ కళాకారులకు అన్యాయం జరగవచ్చు. ఆయనకు ఓటు వేస్తే మిమ్మల్ని మీరు కాకులుగా ఒప్పుకున్నట్లే.. ‘మా’ లో కాకులు లేవనే భావిస్తున్నామని హిందూ సంఘాల నాయకుడు దుర్గా శ్రీరామ్ అన్నారు.

ప్రకాష్ రాజ్ కు తన సొంతం రాష్ట్రంలోనే ప్రజలు తిరస్కరించారు. ఆయన మద్ధతుదారులు పునరాలోచించాలని.. ఇది హిందువుల, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించినదని తెలిపారు. ఇక అటు మా ఎన్నికలకు ముందే అభ్యర్థుల ప్యానెల్ సభ్యులు బహిరంగంగా వాదనలు వినిపిస్తున్నారు.

Also Read: Thief: దొంగ‌గా మారిన నేవీ అధికారి.. భార్య‌తో క‌లిసి న‌గ‌ల దుకాణంలో చోరీ.. దారి త‌ప్పిన విద్యావంతుడు…

DGP Mahender Reddy: తెలంగాణలో మావోయిస్టులకు చోటులేదు.. లొంగిపోతే మెరుగైన చికిత్స అందిస్తాంః డీజీపీ మహేందర్ రెడ్డి

Nirmala Sitharaman: ఆర్ధిక సాయానికి మళ్ళీ కేంద్రం రెడీ ! ఎకనామిక్ ప్యాకేజీపై మరి కొద్దిసేపట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన…