AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi – Murali Mohan: ఎవరేమన్నా చిరంజీవే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ అన్న సీనియర్ నటుడు, నిర్మాత

Sr. Actor Murali Mohan: దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణించిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది మెగాస్టార్ చిరంజీవి..

Chiranjeevi - Murali Mohan: ఎవరేమన్నా చిరంజీవే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ అన్న సీనియర్ నటుడు, నిర్మాత
Chiru Murali Mohan
Surya Kala
|

Updated on: Jun 28, 2021 | 2:39 PM

Share

Sr. Actor Murali Mohan: దర్శకరత్న దాసరి నారాయణ రావు మరణించిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంతమంది మెగాస్టార్ చిరంజీవి అని వ్యాఖ్యానిస్తుండగా.. మరికొందరు భిన్న స్వరం విప్పుతున్నారు. ఇదే విషయంపై సీనియర్ నటుడు నిర్మాత.. ప్రముఖ రాజకీయ నేత మురళీ మోహన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ మెగాస్టార్ ఇటీవల ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణ రావు తర్వాత మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్ అని చెప్పారు. దాసరి జీవించి ఉన్నంత కాలం టాలీవుడ్ కు అన్నివిధాలా అండగా ఉన్నారని.. ఆయన స్థానాన్ని చిరంజీవి కొంతవరకూ భర్తీ చేస్తున్నట్లు అనిపిస్తోందని చెప్పారు.

గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో వ్యక్తుల మధ్య సమస్య తలెత్తినా పరిష్కరించడానికి చిరంజీవి చొరవ తీసుకుంటున్నారు. అంతేకాదు ఎవరైనా చిన్న నటులు కష్టంలో ఉంటె తాను ఉన్నానంటూ ఆర్ధికంగా ఆదుకుంటున్నారు అండగా నిలబడుతున్నారు. ఇక ఇటీవల కరోనా సంక్షోభ సమయంలో సినీ కార్మికులకు, జూనియర్ అండగా నిలబడ్డారు. లాక్ డౌన్ సమయంలో అందరినీ కలుపుకుని కరోనా చారిటీ సంస్థ ద్వారా నిత్యవసర వస్తువులను అందించారు. సినీ కార్మికులకు , సినీ జర్నలిస్టులకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. అంతేకాదు.. కరోనా బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేశాడు .. ఎవరు ఏమన్నా ప్రస్తుతం చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్‌ఫాదర్ అని మురళి మోహన్ అన్నారు.

ఓ పక్కన సినిమాలతో బిజీగా ఉంటూనే చిరంజీవి తన పెద్ద మనసు చాటుకుంటూనే ఉన్నారు. నిత్యావసర సరుకులు మొదలు వ్యాక్సిన్ వేయించే వరకు ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

మురళీ మోహన్ చిరంజీవి హీరోలుగా ప్రేమనాటకం, మనవూరి పాండవులు, వంటి సినిమాలతో పాటు గ్యాంగ్ లీడర్ సినిమాలో అన్నదమ్ములుగా చేశారు.

Also Read: ఈజీ మేడ్ టిఫిన్ : కొబ్బరిపాలతో అటుకుల పులిహోర తయారీ విధానం

తన తమ్ముళ్ళతో కలిసి డ్యాన్స్ చేసిన సల్మాన్ ఖాన్ .. వీడియో సోషల్ మీడియాలో హల్ చల్

మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
మహిళల పాత్రలకు ప్రాధాన్యత ఉంటోందా? వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో