Nirmala Sitharaman: ఆర్ధిక సాయానికి మళ్ళీ కేంద్రం రెడీ ! ఎకనామిక్ ప్యాకేజీపై మరి కొద్దిసేపట్లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన…
దేశంలో సెకండ్ కోవిద్ వేవ్ నేపథ్యంలో దీని ప్రభావం వల్ల తీవ్ర కష్ట నష్టాలకు గురైన రంగాలను ఆదుకునేందుకు సహాయక చర్యలను కేంద్రం ప్రకటించే సూచనలున్నాయి.
దేశంలో సెకండ్ కోవిద్ వేవ్ నేపథ్యంలో దీని ప్రభావం వల్ల తీవ్ర కష్ట నష్టాలకు గురైన రంగాలను ఆదుకునేందుకు సహాయక చర్యలను కేంద్రం ప్రకటించే సూచనలున్నాయి. ఇందులో భాగంగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లింక్డ్ గ్యారంటీ స్కీం ని ప్రస్తుతమున్న 3 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచవచ్చునని భావిస్తున్నారు. అలాగే ప్రభుత్వ కార్పస్ ఫండ్ కూడా పెరగవచ్చు. ఈ స్కీం కింద సుమారు 41,600 కోట్ల గ్యారంటీలకు కేంద్ర కేబినెట్ గత ఏడాది మే నెలలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిమితిని కూడా పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. సెకండ్ కోవిద్ వేవ్ కారణంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో టూరిజం, హార్టీ కల్చర్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వంటి రంగాలు దెబ్బ తిన్నాయి. వీటిని ఆర్ధిక సంక్షోభం నుంచి బయట పడవేసేందుకు అదే విధంగా ఈ పథకంలో హెల్త్ కేర్, ఏవియేషన్ వంటివాటిని కూడా చేర్చేందుకు ఆమె తగిన ప్రతిపాదనలను ప్రకటించవచ్చు. పైగా ఈ పథకం చెల్లుబాటును సెప్టెంబరు 30 వరకు పొడిగించారు.
బ్యాడ్ బ్యాంక్ సస్ట్రక్చర్ కి సంబంధించి 31 వేల కోట్ల గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.ఆర్ధిక మంత్రి ఈ విషయాన్నీ కూడా ప్రస్తావించవచ్చు. ఎకానమీ పునరుద్ధరణకు 29,87, 641 కోట్ల విలువైన సహాయక చర్యలను ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు గత నవంబరులోనే ప్రకటించాయి. కాగా యాక్సిస్ బ్యాంకు వంటివి తమ మూలధన పెట్టుబడులను పెంపొందించుకునే అంశాన్ని కూడా ఆమె ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. నిజానికి ఈ కసరత్తు లోగడ ప్రారంభమైంది,
మరిన్ని ఇక్కడ చూడండి: IND vs SL: “ఇక్కడ రాణిస్తే.. పొట్టి ప్రపంచ కప్‌లో ఆడే ఛాన్స్ రావొచ్చు”; యంగ్ ప్లేయర్లతో టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్
Mehreen Pirzada: బాలకృష్ణ సినిమాలో మెహరీన్.. క్లారిటీ ఇచ్చిన ముద్దుగుమ్మ ..