IND vs SL: “ఇక్కడ రాణిస్తే.. పొట్టి ప్రపంచ కప్‌లో ఆడే ఛాన్స్ రావొచ్చు”; యంగ్ ప్లేయర్లతో టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్

జులైలో టీమిండియా.. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆతిథ్య జట్టుతో తలపడనుంది. ఇప్పటికే ముంబైలో టీమిండియా ఆటగాళ్లంతా క్యారంటైన్ పూర్తి చేసుకుని లంక వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు.

IND vs SL: ఇక్కడ రాణిస్తే.. పొట్టి ప్రపంచ కప్‌లో ఆడే ఛాన్స్ రావొచ్చు; యంగ్ ప్లేయర్లతో టీమిండియా హెడ్ కోచ్ ద్రవిడ్
Rahul Dravid
Follow us
Venkata Chari

|

Updated on: Jun 28, 2021 | 2:03 PM

IND vs SL: జులైలో టీమిండియా.. శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆతిథ్య జట్టుతో తలపడనుంది. ఇప్పటికే ముంబైలో టీమిండియా ఆటగాళ్లంతా క్వారంటైన్ పూర్తి చేసుకుని లంక వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పర్యటనకు టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధవన్ వ్యవహరించనున్నాడు. అలాగే హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ నియమించింది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశ్రాస్తి ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు. అందుకే టీమిండియా రెండో టీమ్ ను శ్రీలంక టూర్‌ కి పంపనున్న నేపథ్యంలో శిఖర్ ధవన్ ను కెప్టెన్‌గా, రాహుల్ ద్రవిడ్‌ను కోచ్‌గా నియమించింది. ఈ టీంలో చాలామంది యంగ్ ప్లేయర్లను సెలక్ట్ చేశారు. ఈమేరకు రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. యంగ్ ప్లేయర్లకు శ్రీలంక పర్యటన చాలా కీలకం కానుందని, ఈ పర్యటనలో బాగా రాణిస్తే… సెలక్టర్ల చూపులో పడేందుకు అవకాశం ఉందని అన్నారు. అలాగే త్వరలో జరగబోయే టీ20ప్రపంచ కప్‌లో ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని యంగ్ ప్లేయర్లకు సూచించారు.

“ఈ పర్యటన యంగ్ ప్లేయర్లకు చాలా కీలకం. ముఖ్యంగా పృథ్వీ షా, దేవదత్ పాడికల్, రుతురాజ్ గైక్వాడ్ లకు ఇదో మంచి అవకాశం. బాగా ఆడితే త్వరలో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఆడేందుకు ద్వారాలు తెరుచుకుంటాయి. ఒకవేళ టీ20 ప్రపంచ కప్‌కు సెలక్ట్ కాకపోయినా.. సెలక్టర్ల దృష్టిలో పడేందుకు అవకాశముందని” ఆయన తెలిపారు. అవకాశాలు వచ్చినప్పడే ఉపయోగించుకోవాలని సూచించారు. ఇలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌లో రాణిస్తే.. కచ్చితంగా బోర్డు చూపు మీపైన పడుతుందని తెలిపారు. కచ్చితంగా ఈ సిరీస్‌లో టీమిండియా గెలుస్తుందని అభిప్రాయపడ్డారు. “శ్రీలంక పర్యటనకు సెలక్ట్ చేసిన స్వ్కార్డ్‌లో చాలామంది యంగ్ ప్లేయర్లు ఉన్నారు. అవకాశాలు అప్పుడప్పుడే వస్తాయి. వచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి. ఈ సంగతి శ్రీలంక పర్యటనకు ఎంపికైన వారికి కూడా తెలుసు. ఐపీఎల్ లో ఎంతబాగా ఆడినా.. అంతర్జాతీయ మ్యాచ్‌లో రాణించడం ఎంతో కీలకమని, ఒక్కోసారి విఫలమైనా.. వాటి నుంచి బయటపడి, మన అవకాశాలను మెరుగుపరుచుకోడానికి ప్రయత్నించాలని” ద్రవిడ్ పేర్కొన్నాడు.

కాగా, జులై13న మొదటి వన్డేతో శ్రీలంక పర్యటన మొదలు కానుంది. రెండో వన్డే జులై 16న, మూడో వన్డే జులై 18న జరగనుంది. వన్డే సిరీస్‌ తరువాత జులై 21న తొలి టీ20 భారత్, శ్రీలంక టీం లు తలపడనున్నాయి. అలాగే రెండో టీ20 జులై 23న, జులై 25న చివరి టీ20 తో శ్రీలంక పర్యటన ముగియనుంది. అన్ని మ్యచ్‌లు కొలోంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే నిర్వహించనున్నారు. వన్డేలు మధ్యాహ్నం గం. 2.30లకు మొదలుకానుండగా, టీ20లు రాత్రి గం.7లకు ప్రారంభమవుతాయి.

Also Read:

Team India: డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి.. ‘నయా వాల్’కు ఉద్వాసన.. తుది జట్టులోకి టీ20 స్పెషలిస్ట్.!

Sanath Jayasuriya: “చాలా బాధగా ఉంది.. ఇలా అయితే మరిన్ని ఘోరపరాజయాలు తప్పవు”; శ్రీలంక మాజీ కెప్టెన్‌ సనత్‌ జయసూర్య

IND vs ENG: లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న భారత ఆటగాళ్లు..!

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?