- Telugu News Photo Gallery Sports photos Team india playes on vacation before test series against england
IND vs ENG: లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతోన్న భారత ఆటగాళ్లు..!
భారత జట్టు ఆగస్టులో ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే, ప్రస్తుతానికి ఆటగాళ్లకు చాలా సమయం దొరకడంతో... సరదాగా లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు.
Updated on: Jun 28, 2021 | 12:00 PM

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఓటమి పాలైన తరువాత భారత ఆటగాళ్లు కుటుంబాలతో కలిసి విహార యాత్రలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌లోని పలు ప్రదేశాలను చుట్టేస్తున్నారు. ఈమేరకు కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

టీమిండియా స్పిన్ బౌలర్ వాషింగ్టన్ సుందర్.. క్రికెటర్ కం కామెంటేటర్ దినేష్ కార్తీక్‌తో కలిసి ఇంగ్లాండ్‌లో చక్కర్లు కొడుతున్నాడు. ఈమేరకు ఓ ఫొటోను షేర్ చేసి, లండన్ నగరం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ, అతని భార్య రితికా, కుమార్తె సమైరాతో కలిసి ఇంగ్లాండ్ వీధుల్లో సంచరిస్తున్నాడు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలను పంచుకున్నాడు. తన కుమార్తెతో ఎంజాయ్ చేస్తున్నాడు.

మయాంక్ అగర్వాల్, అతని భార్యతో కలిసి బ్రైటన్ ప్యాలెస్ అందాలను చూస్తున్న ఓ ఫొటోను పంచుకున్నాడు. లండన్ వీధులో విహరిస్తూ పలు హోటళ్లలో ఆహారాన్ని టేస్ట్ చేసినట్లు పేర్కొన్నాడు. సముద్రతీరంలో తన భార్యతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేసి 'బ్రైట్ సన్నీ డే' అని క్యాప్సన్ ఇచ్చాడు.




