AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి.. ‘నయా వాల్’కు ఉద్వాసన.. తుది జట్టులోకి టీ20 స్పెషలిస్ట్.!

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. బ్యాట్స్‌మెన్ల ఘోర వైఫల్యం కారణంగా భారత జట్టుకు మరో ఐసీసీ ట్రోఫీ..

Team India: డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి.. 'నయా వాల్'కు ఉద్వాసన.. తుది జట్టులోకి టీ20 స్పెషలిస్ట్.!
Indian Cricket Team
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 28, 2021 | 4:50 PM

Share

ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. బ్యాట్స్‌మెన్ల ఘోర వైఫల్యం కారణంగా భారత జట్టుకు మరో ఐసీసీ ట్రోఫీ దూరమైంది. గత ఏడేళ్లలో ఆరో ఐసీసీ ట్రోఫీని చేజేతులా కోల్పోయింది. బ్యాటింగ్ వైఫల్యం మాత్రమే కాదు.. తుది జట్టు ఎంపిక కూడా ఈ ఓటమికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. దీనితో ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు తుది జట్టులో భారీ మార్పులు చేసేందుకు జట్టు యాజమాన్యం సిద్దమైనట్లు తెలుస్తోంది.

అనూహ్యంగా ‘నయా వాల్’గా పేరొందిన ఛటేశ్వర్ పుజారాకు ఉద్వాసన పలకనున్నట్లు సమాచారం. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి పుజారా పెద్దగా రాణించలేకపోతున్నాడు. అప్పుడప్పుడూ మిడిల్ ఆర్డర్‌లో అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నా.. అవి జట్టు విజయానికి ఉపయోగపడట్లేదు. అందుకే పుజారాను తప్పించి కెప్టెన్ విరాట్ కోహ్లీని వన్ డౌన్ పంపించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోందట. అలాగే మిడిల్ ఆర్డర్‌లో టీ20 స్పెషలిస్ట్ కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేయాలని చూస్తున్నారని బీసీసీఐ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం. అటు రవీంద్ర జడేజా స్థానంలో మహమ్మద్ సిరాజ్ లేదా శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరిని తీసుకోవాలని యోచిస్తున్నారట. ఏది ఏమైనా డబ్ల్యూటీసీ ఓటమి అనంతరం టీమిండియా బ్యాటింగ్ లైనప్‌పై మరోసారి ప్రశ్నల వర్షం కురుస్తోంది. హెడ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ తమకు నచ్చిన వారికి మాత్రమే తుది జట్టులో చోటు కల్పిస్తున్నారన్న టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

కాగా, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ 217 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం కివీస్ 249 పరుగులు చేసి 32 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 170 పరుగులకు కట్టడి చేసిన న్యూజిలాండ్.. 138 పరుగుల టార్గెట్‌ను సునాయాసంగా చేధించి అద్భుత విజయాన్ని అందుకుని ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం విదితమే.

Also Read: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..

పన్నెండు అడుగుల కింగ్ కోబ్రాను రెండు చేతులతో పట్టుకుని.. కాళ్ల కింద వేసి తొక్కుతూ..

నిద్ర లేమితో ఇబ్బంది పడుతున్నారా ..బిర్యానీ ఆకుతో ఇలా చేసి చూడండి

తెలుగు వార్తలు లైవ్ ఇక్కడ చూడండి