AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda Movie : థియేటర్స్‌లో దెబ్బేసినా.. యూట్యూబ్‌లో దుమ్మురేపింది..

తాజాగా రామ్ పోతినేని సినిమా యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఆ సినిమానే స్కంద. రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్స్ లో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీలోనూ ఈ సినిమా అంతంతమాత్రమే వ్యూస్ సొంతం చేసుకుంది.

Skanda Movie : థియేటర్స్‌లో దెబ్బేసినా.. యూట్యూబ్‌లో దుమ్మురేపింది..
Skanda
Rajeev Rayala
|

Updated on: Jul 25, 2024 | 3:45 PM

Share

థియేటర్స్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కానీ సినిమాలు ఇప్పుడు ఓటీటీలో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఎన్నో సినిమాలు థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించకపోయినా టీవీల్లో, ఓటీటీల్లో మంచి ఆధారణపొందుతున్నాయి. అలాగే యూట్యూబ్ లోనూ మంచి విజయాలను అందుకుంటుంటాయి. తాజాగా రామ్ పోతినేని సినిమా యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఆ సినిమానే స్కంద. రామ్ పోతినేని, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి వచ్చింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. థియేటర్స్ లో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీలోనూ ఈ సినిమా అంతంతమాత్రమే వ్యూస్ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు యూట్యూబ్ లో దుమ్మురేపింది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఈ రికార్డ్ క్రియేట్ చేసింది తెలుగు భాషలో కాదు..

ఇది కూడా చదవండి : Tollywood : ఈ నాన్న కూచి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు ఇండియానే షేక్ చేస్తున్న హీరోయిన్ ఆమె..

యూట్యూబ్ లో మన సినిమాలు చాలా హిందీలో డబ్ అయ్యి అందుబాటులో ఉంటాయి. ఇలా హిందీలోకి డబ్ అయిన చాలా సినిమాలు మంచి వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేశాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు ఇలా యూట్యూబ్ లో భారీ వ్యూస్ తెచ్చుకోవడం కొత్తేమి కాదు. గతంలో బెల్లం కొండ శ్రీనివాస్ నటించిన సినిమాలు కూడా యూట్యూబ్ లో మంచి వ్యూస్ తెచ్చుకున్నాయి.

ఇది కూడా చదవండి : Krishna Vamsi: ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను.. కన్నీళ్లు పెట్టుకున్న కృష్ణవంశీ

ఇక ఇప్పుడు రామ్ నటించిన స్కంద సినిమా కూడా యూట్యూబ్ లో అదరగొడుతోంది. తాజాగా ఈ సినిమా హిందీలో సంచలనం సృష్టించింది. జూన్‌ 17న ‘స్కంద’ హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. ఇక ఇప్పుడు ఈ సినిమా 100 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అప్ లోడ్ చేసిన నెలన్నర లోపే ఇలా 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. ఇక రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ మూవీ తో బిజీగా ఉన్నాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..