AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: హీరో అజిత్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ ఫెరారీ కారు.. ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్‌

అజిత్ తన సహ నటుల కంటే చాలా భిన్నంగా ఉంటాడు. ముఖ్యంగా తన ప్రపంచం చాలా వేరు. సినిమాలు చేస్తూనే తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. దేశ విదేశాల్లో చాలా సార్లు బైక్ రైడింగ్ చేశాడు అజిత్. ఈ స్టార్ హీరో గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ రేసింగ్ బైక్ లు ఉన్నాయి

Ajith Kumar: హీరో అజిత్ గ్యారేజీలోకి కొత్త లగ్జరీ ఫెరారీ కారు.. ఎన్ని కోట్లో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయ్‌
Ajith Kumar
Basha Shek
|

Updated on: Jul 25, 2024 | 3:28 PM

Share

కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రజనీకాంత్-కమల్ హాసన్ తర్వాత, అత్యధిక అభిమానులను కలిగి ఉన్న రెండవ తరం స్టార్ నటులలో అజిత్ కూడా ఒకరు. కేవలం తమిళనాటే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ స్టార్ హీరోకు భారీగా అభిమానులు ఉన్నారు. అయితే అజిత్ తన సహ నటుల కంటే చాలా భిన్నంగా ఉంటాడు. ముఖ్యంగా తన ప్రపంచం చాలా వేరు. సినిమాలు చేస్తూనే తనకు ఇష్టమైన బైక్ రైడింగ్ చేస్తూ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. దేశ విదేశాల్లో చాలా సార్లు బైక్ రైడింగ్ చేశాడు అజిత్. ఈ స్టార్ హీరో గ్యారేజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ రేసింగ్ బైక్ లు ఉన్నాయి. అంతే కాకుండా అజిత్‌కి కార్లంటే ప్రత్యేక ప్రేమ. అతని వద్ద చాలా అద్భుతమైన కార్లు ఉన్నాయి. ఇప్పుడు అజిత్ గ్యారేజీలోకి మరొక కొత్త కారు వచ్చి చేరింది. తాజాగా ఎరుపు రంగు ఫెరారీ కారును కొనుగోలు చేశాడీ స్టార్ హీరో. ఈ లగ్జరీ కారు ధర దాదాపు 9 కోట్ల రూపాయలు. ఈ సందర్భంగా అజిత్ తన కొత్త కారు పక్కన కూర్చొని ఫొటోలకు పోజులిచ్చాడు. వీటిని అజిత్ అభిమానులు తమ సోషల్ నెట్‌వర్కింగ్ ఖాతాల్లో షేర్ చేస్తున్నారు.

ఫీచర్లు ఇవే..

అజిత్ ఫెరారీ SF90 మోడల్ కారును కొనుగోలు చేశాడు. భారతదేశంలో దీని ధర 9 కోట్గాలు ఉంటుంది. ఇది 3990 cc అత్యంత శక్తివంతమైన కారు. ఈ కారు కొన్ని సెకన్లలో గంటకు 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారులో అనేక అధునాతన సాంకేతికతలు కూడా ఉన్నాయి. SF90 కారులో అత్యుత్తమ సేఫ్టీ టెక్నాలజీ కూడా ఉంది. కాగా అజిత్ కుమార్ వద్ద 34 కోట్ల విలువైన లాంబోర్గినీ కారు కూడా ఉంది. ఇది కాకుండా ల్యాండ్ రోవర్ డిస్కవరీ, మెర్సిడెస్ మేబ్యాక్, బిఎమ్‌డబ్ల్యూ తదితర లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటితోపాటు 24 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ 1000ఆర్‌ఆర్ బైక్, 20 లక్షల విలువైన అప్రిలియా కపోనార్డ్ బైక్, 21 లక్షల విలువైన బిఎమ్‌డబ్ల్యూ కె1300, 19 లక్షల విలువైన కవాసకి నింజా బైక్స్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. అజిత్ కుమార్ ప్రస్తుతం ‘విడ మయూర్చి’ చిత్రంలో నటిస్తున్నారు. దీని తర్వాత ‘గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ’ సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఆ తర్వాత నటుడు యశ్‌తో కలిసి అజిత్ ‘కేజీఎఫ్ 3’ చిత్రంలో నటించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..