బాలయ్యతో నమిత.. కానీ కొంచెం డిఫరెంట్‌గా

“సింహమంటీ చిన్నాడో వేటకొచ్చాడే”..అంటూ బాలయ్య సరసన వయ్యారాలు ఒలకబోసిన బొద్దుగుమ్మ నమిత మరోసారి నందమూరి నటసింహంతో నటించనుందనే వార్తలు టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలుగులో” సొంతం” మూవీలో తొలిసారి మెరిసిన నమిత.. ఆ తర్వాత పలు పాత్రల్లో ఒదిగిపోయింది. క్యారెక్టర్ ఓరియంటెడ్‌గా సాగిన పాత్రల్లో నటించిన ఈమె గ్లామర్ బ్యూటీగా మెరిసింది. ఆమె నటించిన అన్ని చిత్రాల్లోకెల్లా సింహం మూవీలో బాలయ్యతో వేసిన స్టెప్పులు ఆమెను ఎప్పటికీ మర్చిపోకుండా చేశాయి. సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ జంట మరోసారి […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:08 pm, Wed, 31 July 19
బాలయ్యతో  నమిత.. కానీ కొంచెం డిఫరెంట్‌గా

“సింహమంటీ చిన్నాడో వేటకొచ్చాడే”..అంటూ బాలయ్య సరసన వయ్యారాలు ఒలకబోసిన బొద్దుగుమ్మ నమిత మరోసారి నందమూరి నటసింహంతో నటించనుందనే వార్తలు టాలీవుడ్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

తెలుగులో” సొంతం” మూవీలో తొలిసారి మెరిసిన నమిత.. ఆ తర్వాత పలు పాత్రల్లో ఒదిగిపోయింది. క్యారెక్టర్ ఓరియంటెడ్‌గా సాగిన పాత్రల్లో నటించిన ఈమె గ్లామర్ బ్యూటీగా మెరిసింది. ఆమె నటించిన అన్ని చిత్రాల్లోకెల్లా సింహం మూవీలో బాలయ్యతో వేసిన స్టెప్పులు ఆమెను ఎప్పటికీ మర్చిపోకుండా చేశాయి.

సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ జంట మరోసారి బిగ్ స్క్రీన్‌పై కనువిందు చేయనున్నారని టాక్. అయితే ఈసారి కథానాయికగా కాదట. ఏకంగా బాలయ్యకు ధీటుగా బదులిచ్చే విలన్ క్యారెక్టర్‌లో కనిపించనుందట నమిత. ఈ మూవీని హిట్ చిత్రాల దర్శకుడు కేఎస్ రవికుమార్ డైరెక్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి రాబోతుందని కూడా అనుకుంటున్నారు. అయితే నమిత పాత్రకు ముందుగా వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను అనుకున్నా.. చివరికి నమితనే ఫైనల్ చేశారట చిత్ర యూనిట్. చూడాలి మరి.. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నమిత ఎలా కనిపించబోతుందో..