‘మగధీర’కు అప్పుడే పదేళ్లా..!: రామ్ చరణ్

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ‘మగధీర’ ఒకటి. చిరుతతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన చరణ్‌తో రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్యకావ్యం.. టాలీవుడ్‌లో వందకోట్లకు పైగా గ్రాస్‌‌ను కలెక్ట్ చేసిన మొదటి చిత్రంగా రికార్డును సృష్టించింది. ఇక సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పది సంవత్సరాలు పూర్తైంది. 2009సంవత్సరంలో జూలై 30న ఈ చిత్రం విడుదల కాగా.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకొన్నాడు రామ్ చరణ్. ‘‘అప్పుడే […]

  • Updated On - 12:58 pm, Wed, 31 July 19 Edited By: Anil kumar poka
‘మగధీర’కు అప్పుడే పదేళ్లా..!: రామ్ చరణ్

మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ‘మగధీర’ ఒకటి. చిరుతతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన చరణ్‌తో రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్యకావ్యం.. టాలీవుడ్‌లో వందకోట్లకు పైగా గ్రాస్‌‌ను కలెక్ట్ చేసిన మొదటి చిత్రంగా రికార్డును సృష్టించింది. ఇక సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి పది సంవత్సరాలు పూర్తైంది. 2009సంవత్సరంలో జూలై 30న ఈ చిత్రం విడుదల కాగా.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకొన్నాడు రామ్ చరణ్.

‘‘అప్పుడే పది సంవత్సరాలు అయిందంటే నమ్మలేకపోతున్నా. ఈ మధ్యనే వచ్చినట్లుగా అనిపిస్తోంది. మగధీర డ్రీమ్ టీమ్ అందరికీ పెద్ద థ్యాంక్స్. కీరవాణి గారు, కాజల్, గీతా ఆర్ట్స్ అందరికీ థ్యాంక్స్. అప్పుడు రాజమౌళి గారి వద్ద నుంచి చాలా నేర్చుకున్నా. ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నా’’ అని చెర్రీ ఇన్‌స్టాలో కామెంట్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆ సమయంలో తీసుకున్న కొన్ని ఫొటోలను కూడా ఆయన షేర్ చేశాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి ఆర్ఆర్‌ఆర్‌లో నటిస్తున్నాడు చెర్రీ. ఈ చిత్రానికి వచ్చే ఏడాది జూలై 30న ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.

https://www.instagram.com/p/B0kV49FnEIw/