AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఉచితంగా రూ.7 లక్షల బీమా.. రూపాయి కూడా ప్రీమియం లేదు..

దేశంలో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే ప్రతీఒక్కరికి తప్పనిసరిగా పీఎఫ్ అకౌంట్ ఉంటుంది. ఉద్యోగులకు సామాజిక, ఆర్ధిక భద్రతను ఈ ఖాతా ద్వారా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పీఎఫ్ ఖాతాదారులకు అనేక బెనిఫిట్స్ అందిస్తున్నారు. అందులో జీవిత బీమా కూడా ఒకటి. దాని గురించి తెలుసుకుందాం.

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఉచితంగా రూ.7 లక్షల బీమా.. రూపాయి కూడా ప్రీమియం లేదు..
Epfo
Venkatrao Lella
|

Updated on: Feb 10, 2026 | 8:00 AM

Share

ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులందరికీ కేంద్ర ప్రభుత్వం అనేక అనేక బెనిఫిట్స్ అందిస్తోంది. పీఎఫ్ అకౌంట్‌లోని డబ్బులపై ప్రతీ ఏటా వార్షిక వడ్డీతో పాటు పెన్షన్ పథకం ద్వారా 60 ఏళ్ల రిటైర్మెంట్ పీరియడ్ తర్వాత నెలనెలా పెన్షన్ అందిస్తోంది. ప్రస్తుతం మినిమం పెన్షన్ పరిమితి రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని రూ.5 వేలకు పెంచాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో దీనిని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర మరోక సదుపాయం కూడా కల్పిస్తోంది. అదే రూ.7 లక్షల వరకు జీవిత బీమా. ఎంప్లాయీస్ డిపాజిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం(EDLI) కింద ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.

రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు

ఈ జీవిత బీమా ప్రయోజనం పొందేందుకు పీఎఫ్ ఖాతాదారుడు రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయగానే స్వచ్చంధంగా ఈ పథకం వర్తిస్తుంది. ఇందుకోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి దరఖాస్తు ఫారం నింపాల్సిన అవసరం లేదు. మీరు చెల్లించాల్సిన ప్రీమియం మీ కంపెనీ లేదా యజమాని చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకం వల్ల మీరు సర్వీస్ కాలంలో ఉన్నప్పుడు ఏమైనా జరిగితే కుటుంబానికి రూ.7 లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు.

ఎలా లెక్కిస్తారంటే..?

బీమా సొమ్మును ఎలా నిర్ణయిస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఉద్యోగి జీతంపై బీమా ఎంత ఇవ్వాలనేది ఆధారపడి ఉంటుంది. గత 12 నెలల ఉద్యోగి బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. బీమా కవర్ మొత్తం సగటు జీతం కంటే 35 రెట్లు ఎక్కువగా అందిస్తారు. ఈ మొత్తానికి రూ.1.75 లక్షల బోనస్ జోడిస్తారు. ప్రస్తుతం గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. రూ.15,000ను 35తో గుణిస్తే రూ.5.25 లక్షలు వస్తాయి. రూ.1.75 లక్షల బోనస్‌ను జోడిస్తే మొత్తం రూ.7 లక్షలకు చేరుకుంటుందన్నమాట.

క్లెయిమ్ ఎలా చేసుకోవాలి..?

పీఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఉద్యోగం చేసే సమయంలో మరణిస్తే నామినీ లేదా చట్టపరమైన వారసుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. EDLI ఫారం 5 IFని పూర్తి చేసి EPFO ​​ప్రాంతీయ కార్యాలయంలో సమర్పించాలి. ఇక డెట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, పుట్టిన తేదీ రుజువు వంటి పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో అధికారులు పరిశీలించి డబ్బులు అకౌంట్లో జమ చేస్తారు. నామినీకి ఈ డబ్బుపై మొదట హక్కు ఉంటుంది. నామినీ లేకపోతే జీవిత భాగస్వామికి పొందవచ్చు. ఇక 25 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న కుమారులు లేదా పెళ్లికాని కుమార్తెలు కూడా దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు.

Follow Us
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు