Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : రిలీజ్‌కు రెడీ అయిన సినిమా.. 50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..

ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్న వినోద్ కిషన్ . గతంలో 'నా పేరు శివ', 'అంధగారం', 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాల్లో నటించారు. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. కామెడీ తో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు.

Tollywood : రిలీజ్‌కు రెడీ అయిన సినిమా.. 50 రూపాయలకే సినిమా టికెట్ ఇస్తామంటున్న హీరో..
Peka Medalu Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 16, 2024 | 1:43 PM

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వ్యవహరించి హీరోగా చేసిన సినిమా ‘ఎవరికీ చెప్పొద్దు’ థియేటర్ మరియు ఓటిటిలో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే ప్రొడక్షన్ హౌస్ నుంచి రెండవ సినిమాగా పేక మేడలు రాబోతోంది. ఈ సినిమాతో తొలిసారిగా తెలుగులో హీరోగా పరిచయమవుతున్న వినోద్ కిషన్ . గతంలో ‘నా పేరు శివ’, ‘అంధగారం’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాల్లో నటించారు. అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది. కామెడీ తో పాటు మధ్యతరగతి ఫ్యామిలీ ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు.

ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. ఇంతకుముందు వినూత్న రీతిలో క్యూఆర్ స్కాన్ తో, బంతితో హీరో చేసిన ప్రమోషన్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ఇక ఇప్పుడు అదే తరహాలో ప్రమోషన్ చేస్తూ పెయిడ్ ప్రీమియర్స్ టికెట్ రేట్ 50 రూపాయలకే పెట్టి వైజాగ్, విజయవాడ , హైదరాబాద్ లో పలు ప్రదేశాల్లో ప్రత్యేక షోలు వేస్తున్నారు. కొత్తగా చేస్తున్న ఈ ప్రమోషన్స్ చూసి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చి సినిమాని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నెల 19న పేక మెడలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ నీలగిరి మామిళ్ల మాట్లాడుతూ .. సినిమా ట్రైలర్ కి చాలా మంచి స్పందన లభిస్తుంది. ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే గారు చాలా సపోర్ట్ చేశారు. సినిమాల్లో నటించిన నటీనటులందరూ బాగా సహకరించారు. ప్రేక్షకులు కూడా మేము ఏ ప్రమోషన్స్ చేస్తున్నా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఈనెల 19న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తున్నారో మా సినిమా కూడా అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాము. కచ్చితంగా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నాను అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.